టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస్ చిలక జోస్యం బాగానే చెబుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో అన్ని జాతీయ సర్వేలు చెప్పుకొచ్చాయి. వైసీపీ గాలి బాగా ఉందని కూడా చెబుతున్నాయి. అయితే విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీకి 150 సీట్లు తక్కువ కాకుండా వస్తాయని ఢంకా భజాయిస్తున్నారు. టీడీపీకి పాతిక ఎంపీ సీట్లు కూడా ఖాయమని ఆయన లెక్కలు చెబుతున్నారు. టీడీపీది చారిత్రాత్మకమైన విజయమని కూడా అంటున్నారు. ఏపీలో కొత్త శకారంభం 2019 నుంచి మొదలు కాబోతోందని గంటా వారు సెలవిస్తున్నారు.

సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఉత్తరంలో మీ సంగతేంటని అడిగితే తనకేం బ్రహ్మాండంగా గెలుస్తానని, తనకు సాటి పోటీ ఎవరూలేరని కూడా మంత్రిగారు అంటున్నారు. తాను ప్రతి ఎన్నికకూ అసెంబ్లీ సీట్లు మార్చడానికి ప్రజల అభిమానమే కారణమని ఆయన చెప్పుకున్నారు. ప్రతీసారి ఒక్కో నియోజకవర్గం వారు పిలిచి మీరే పోటీచేయాలని కోరడం వల్లనే తాను అక్కడకు వెళ్ళాల్సివస్తోందని కూడా అందమైన వివరణ ఇచ్చారు.

తనకు విశాఖ ప్రజలు ఎక్కడైనా పట్టంకడుతున్నారని చెప్పుకుంటున్న గంటా తాను భీమిలి నుంచి విశాఖ ఉత్తరానికి షిఫ్ట్ కావడానికి హైకమాండ్ నిర్ణయమే కారణమని అంటున్నారు. విశాఖ ఉత్తరం వీక్ గా ఉందని, తనవల్ల పార్టీ గెలుస్తుందని భావించబట్టే అక్కడ నుంచి పోటీచేయమని ఆదేశించారని అంటున్నారు. అందువల్లనే తాను పోటీకి దిగానని, ఉత్తరం సీటు నుంచి బంపర్ మెజారిటీతో గెలుస్తానని కూడా గంటా గట్టిగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: