ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ కొత్త పేరు పెట్టారు.. అదే యూటర్న్ బాబు.. ఎందుకంటే.. ఆయన పదే పదే మాట మారుస్తున్నారు కాబట్టి.. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో అంత అనుభవం ఉంచుకుని మరీ వ్యూుహాత్మక పొరపాట్లు చేశారు. 


ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా.. అప్పటి ప్రధానమంత్రి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిపై పట్టుబట్టకుండా బీజేపీ సర్కారు చెప్పిన ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడం ఘోరమైన మైనస్ పాయింట్. అంతే కాదు..అదేదో  గొప్పవిషయం సాధించినట్టు అప్పట్లో సంబరాలు కూడా చేసుకున్నారు. 

ఆ తర్వాత ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కానీ.. నాలుగేళ్లు కాపురం చేసి.. చివరి ఏడాదిలో బీజేపీతో విడాకులు తీసుకున్నారు. మళ్లీ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారు. దీన్ని యూటర్న్ అని వైసీపీ, బీజేపీ వెక్కిరిస్తుంటే.. నాది యూటర్న్ కాదు రైట్ టర్న్ అంటూ సమర్థించుకున్నారు. 

ఈ ఐదేళ్ల నాటి పరిణామాలు అన్నీ జనం నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఎవరి టర్న్ ఎలా ఉందో అంచనాకు వస్తున్నారు. రాజకీయ, పాలనానుభవం చంద్రబాబు స్థాయిలో లేకపోయినా ప్రత్యేక హోదా గురించి స్థిరంగా వైసీపీ పోరాడుతున్న విషయం వారు గమనించారు. అందుకే  నాది యూటర్న్ కాదు.. . రైట్ టర్న్ అంటున్న  చంద్రన్నతో మాకే టర్నూ వద్దని ఆంధ్రప్రజ గొంతెత్తి చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: