ఏపీ సీఎం చంద్రబాబు, మమతా బెనర్జీ.. ఇటీవల చాలా సారూప్యంగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ అంటే చాలు.. కయ్యమని లేచే వారిలో ప్రస్తుతం వీరిద్దరూ చాలా ముందు ఉంటున్నారు. మొన్న పుల్వామా దాడి, ఆ తర్వాత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ 2.. విషయంలోనూ వీరిద్దరి అభిప్రాయాలు ఒకేలా వ్యక్త పరిచారు. 


ఇప్పుడు మమతా బెనర్జీ ఏపీలోనూ చంద్రబాబుకు దన్నుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరి దీదీని చూసి ఇక్కడ ఏపీలో ఓట్లు వేసే వారు ఉన్నారా.. ఉంటే వారు ఎవరు.. వారి ఓట్లు ఎంతవరకూ పడతాయి.. ఇవీ ఇంట్రస్టింగ్ క్వశ్చన్స్. దీదీగా చెప్పబడే మమతా బెనర్జీ ప్రచారం చేసింది విశాఖపట్నంలో.

విశాఖపట్నంలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, నౌకా దళ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అందులో బెంగాల్ వంటి ఉత్తర భారత దేశానికి చెందిన వారూ ఉంటారు. వారి ఓట్లు మమతా ద్వారా రాబట్టాలన్నది చంద్రబాబు ప్లాన్. కానీ.. ఇక్కడ ఓ కీలక విషయం గమనించాలి. 

ఈ నౌకాదళం, రక్షణ శాఖతో పాటు స్థానికంగా ఉండే ఓటర్లు కూడా దేశభక్తికి వ్యతిరేకంగా.. దేశ సైన్యానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన చంద్రబాబు, మమతల వాదననను ఖండించేవారే కానీ సపోర్ట్ చేసేవారు కాదు. మరి అలాంటి వారిని చూసి విశాఖ ప్రజ ఓట్లు వేస్తుందో.. నో ఛాన్స్ అంటోంది ఆంధ్రప్రజ. 



మరింత సమాచారం తెలుసుకోండి: