చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా.. లేక.. ఈసారైనా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా.. ఇవీ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్.. గెలుపు కోసం చంద్రబాబు, జగన్ చేస్తున్న ప్రచారం పీక్స్ కు చేరుకుంది. ఇక పోలింగ్‌ కు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. 


ఈ నేపథ్యంలో వివిధ సర్వే సంస్థలు తమ ఫలితాలు ప్రకటిస్తున్నాయి.  గెలుపోటములపై అంచనాల లెక్కలు వస్తున్నాయి. అలాంటి సంస్థల్లో ఒకటి రెడ్‌ ప్రికి న్యూస్ అనే సంస్థ.ఈ సంస్థ ఇటీవల డిటైల్డ్ సర్వే నిర్వహించింది. ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. 

ఈ సర్వే ప్రకారం..జిల్లాల వారీ వివరాలు చూస్తే.. రెండు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. వైసీపీ ఈ జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది..

 మొత్తం నియోజకవర్గాలు ఆ పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన ఖాతా తెరిచే ఛాన్సు లేదు. ఈ రెండింటి తర్వాత కడప జిల్లాలోనూ వైఎస్సార్ పార్టీ జోరు మీద ఉంది. ఈ జిల్లాలో ఒక్క జమ్మలమడుగు తప్ప అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది.  ఓవరాల్‌ గా వైసీపీకి 124 స్థానాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: