ఏపీ సీఎం చంద్రబాబుపై నటుడు, విద్యాసంస్థల అధిపతి మోహన్ బాబు కొన్ని రోజులుగా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబుకు చిత్తూరు జిల్లాలో విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో వేల సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. 


తమ కళాశాల పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్న కారణంతో ఆయన ఇటీవల ఆందోళన చేశారు. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఆ తర్వాత ఏకంగా వైసీపీలో చేరి రోజూ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును ఏకేస్తున్నారు. 

మోహన్ బాబు ఇన్నిరోజులుగా విమర్శల దాడి చేస్తున్నా స్పందించని చంద్రబాబు.. చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఎదురుదాడి చేశారు. మోహన్ బాబు పేరు చెప్పకుండానే విమర్శించారు. హైదరాబాద్ నుంచి కొన్ని  వలస పక్షలు వస్తున్నాయి.. 

ఏపీకి వచ్చి మనల్ని విమర్శిస్తున్నాయి.. ఈ జిల్లా నుంచి ఓ విద్యాసంస్థల అధిపతి ఉన్నాడు.  ఆయన కూడా నన్ను విమర్శిస్తున్నాడు. వీళ్లంతా హైదరాబాద్ నుంచి వస్తున్న వలస పక్షలు.. మీరు హైదరాబాద్‌లో ఉంటే ఉండండి.. కేసీఆర్‌కు ఊడిగం చేసుకుంటే చేసుకోండి.. కానీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తానంటే ఊరుకునేది లేదు అంటూ తన స్టైల్‌లో మండిపడ్డారు. మోహన్ బాబుపైనే కాదు.. తనను విమర్శిస్తున్న సినీనటులందరిపైనా చంద్రబాబు మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: