గతంలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ పై కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పెట్టిన అక్రమ కేసులను విచారించిన సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసినదే. ఎన్నికల తరుణంలో మహారాష్ట్రలో తన పదవికి రాజీనామా చేసి ఒకానొక అర్ధరాత్రి సమయంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ చేరడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ముఖ్యంగా జేడీ లక్ష్మీనారాయణ గతంలో జగన్ పై పెట్టిన అక్రమ కేసులను విచారిస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చేవారిని టీడీపీకి అనుకూలంగా జేడీ లక్ష్మీనారాయణ వ్యవహరించేవారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.


ఇదే సమయంలో ఎన్నికల తరుణంలో ఇప్పుడు జనసేన పార్టీలో చంద్రబాబు డైరక్షన్లోనే చేరారనే కామెంట్లు కూడా వినబడుతున్నాయి. 2019 ఎన్నికలకు జగన్ని ఎదుర్కొనటానికి జనసేన టిడిపి పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజల ముందు విడిపోయినట్లు నటిస్తున్నారన ఈ తరుణంలో జేడీ లక్ష్మీనారాయణ నెక్స్ట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఇటీవల తాను పేర్కొనడంతో ఈ విషయం రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


విశాఖపట్టణం జిల్లా నుండి పోటీ చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు దాదాపు 85-125 వరకు సీట్లు వస్తాయని పేర్కొనడంతో ఏపీ ప్రజలు జేడీ లక్ష్మీనారాయణ చేసిన జోస్యం పై సెటైర్లు వేస్తున్నారు. గతంలో జగన్ ని ఇబ్బంది పెట్టి అతని మీద అవినీతి ముద్ర వేయడానికి ఎల్లో మీడియా కి సహకరించిన నీవు ఎన్నికలకు సంవత్సరం ముందు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి 85-125 వరకు అంటున్న జేడీ నువ్వు దేవుడివయ్యా నీ మాటలు అస్సలు నమ్మమంటున్న ఆంధ్ర ప్రజలు. మీరు ఆడుతున్న కుమ్మక్కు రాజకీయాలు ఆంధ్ర ప్రజలకు అర్థమవుతుందని కామెంట్లు కూడా చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: