ఉత్తరాంధ్రలో టీడీపీ బలం చెప్పనక్కరలేదు. ఆ పార్టీని ఇప్పటికి ఆరుసార్లు నెత్తిన పెట్టుకున్న జిల్లాలు ఇవి. రెండు సార్లు వైఎస్సార్ చరిష్మాతో ఉత్తరాంధ్ర టర్న్ ఐంది. ఈసారి ఎన్నికలు టీడీపీకి, వైఎస్సార్ రాజకీయ వారసుడు జగన్ కి  మధ్యన జరుగుతున్నాయి. మరి ఈ మూడు జిల్లాలు ఎటువైపు ఉన్నాయన్నది ఆసక్తికరంగా ఉంటే. అక్కడ బిగ్ ఫిగర్లు తల రాతలు ఎలా ఉన్నాయన్నది కూడా చూడాలి.



జగన్ తన పార్టీ తరఫున పార్టీనే నమ్ముకున్న ఇద్దరు కుర్రాళ్ళకు  ఈసారి టికెట్లు ఇచ్చారు. అది వారి మీద జగన్ పెట్టుకున్న  ధీమా అనుకోవాలి. దానికి తగినట్లుగానే వారు కూడా చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అదీప్ రాజ్ అనే యువకుడు ఇపుడు వైసీపీ తరఫున పోటీ చెస్తున్నారు. ఆన సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ‌మూర్తికి చుక్కలు చూపిస్తున్నారు.


యువజన కాంగ్రెస్ లో చిన్న నాయకుడిగా ఉన్న  అదీప్ వైసీపీలో చేరి  ఇపుడు బండారు లాంటి కొండను ఢీ కొంటున్నారు. ఆయన వైసీపీలో చేరాక  పార్టీని అక్కడ పూర్తిగా బలపరచారు. నిన్న జరిగిన జగన్ మీటింగుకు ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారంటేనే అదీప్ పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో  మరో యువ నేత వైసీపీలో ఉన్నారు. ఆయన టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏకంగా మంత్రి అచ్చెనాయుడు మీద పోటీకి దిగుతున్నారు. ఇక్కడ నామినేషన్ వేసేటపుడు  తిలక్ కి వచ్చిన జనం చూస్తే మతి పోతుందన్నంత రేంజిలో వచ్చారు. కాళింగా సామాజిక వర్గానికి చెందిన తిలక్ ఇపుడు మంత్రికి చమటలు పట్టించేస్తున్నారు. 


బలమైన మంత్రిని  గెలుపు కోసం గడప గడపా తిరిగేలా చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో గెలిచిన అచ్చెన్న వైసీపీ గాలిలో ఇపుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరో వైపు మంత్రి మీద అసంత్రుప్తి బాగా కనిపిస్తోందిక్కడ.  అలాగే పెందుర్తిలో టీడీపీ అభ్యర్ధి బండారుకు కూడా ఎదురుగాలి వీస్తోందని అంటున్నారు. ఈ నీపధ్యంలో దూకుడుగా పోరాడుతున్న ఈ ఇద్దరు  కుర్రాళ్ళు అద్భుతాలు చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: