గుంటూరు జిల్లా.. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసే జిల్లాల్లో ఇది రెండోది.. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లు ఉన్న జిల్లా ఇది. ప్రస్తుతం ఇది రాజధాని జిల్లా కావడంతో ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా ఉంది. 


కానీ ఈ అంచనా తప్పని కేకే సర్వే చెబుతోంది. ఈజిల్లాలో కేకే టీమ్ చేసిన సర్వే ప్రకారం.. మొత్తం వైసీపీ 14 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదట. మరో రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉండి పోటీ ఇస్తోందట. మరో స్థానంలో మూడో ప్లేస్ లో ఉన్నది. వైసీపీకి 45 శాతం వరకూ ఓట్ బ్యాంకింగ్ వస్తోందట. 

ఇక అధికార టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ రెండు స్థానాల్లో ఫస్ట్ ప్లేస్‌ లో ఉన్నదట. మరో ఆరు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. మరో 9 స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ పార్టీ ఓటు బ్యాంకింగ్‌ వచ్చేసి.. 34- 35 వరకూ ఉంది. ఇక మూడో పార్టీ జనసేన ఈ ప్రభావం ఈ జిల్లాపై నామమాత్రమే. 

జనసేన గుంటూరు జిల్లాలో కేవలం ఒకే ఒక్క స్థానంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదట. మరో రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉండి పోటీ ఇస్తోంది. మరో 14 స్థానాల్లో కేవలం మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి ఇరవై శాతం వరకూ ఓట్ బ్యాంకింగ్ రావచ్చని కేకే టీమ్ అంచనా వేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: