2014 ఎన్నికలలో ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీని స్థాపించి అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టాను అని ఉన్నారు ఆ పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతు తెలిపి ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడిని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తాను అదే ప్రజల అందరి ముందు పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోయాక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగినా ఎక్కడ కూడా ప్రశ్నించిన దాఖలాలు లేవు ఇదే క్రమంలో చంద్రబాబు చేస్తున్న అవినీతి ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ నాయకులు మరియు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ని అనేకసార్లు మీడియా సమావేశాలు నిర్వహించి విమర్శిస్తూ చంద్రబాబు నీ ప్రొటెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్.


అయితే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి తెలిపిన మద్దతు ఉపసంహరించుకుని ప్రస్తుతం టీడీపీ తో ఎటువంటి సంబంధం లేదు అని చెబుతున్న పవన్ కల్యాణ్ 2019 ఎన్నికలకు వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల విషయంలో పవన్ కళ్యాణ్ అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.


ఎన్నికలకు ముందే జనసేన పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులు ఎటువంటి హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారో వాటిని స్టాంపు పేపర్ల పై ప్రజల తో ఒప్పందం చేసుకునే విధంగా పవన్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనం అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం పట్ల ఏపీ ప్రజలు మాత్రం గత ఎన్నికలలో రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తే చంద్రబాబుని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తాను అని ప్రజల ముందే వాగ్దానం చేసిన పవన్ కళ్యాణ్ పేపర్ల పై ఈ విధంగా హామీల విషయంలో ఒప్పందాలు చేస్తే నమ్మే ప్రజలు ప్రస్తుతం ఏపీలో లేరని సెటైర్లు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: