త్వరలో తెలంగాణ రాష్ట్రం లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తన ప్రసంగాలతో దుమ్ము దులుపుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా మెజారిటీ స్థానాలు గెలిచి స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి ప్రభుత్వాన్ని స్థాపించిన కేసీఆర్ అనంతరం వెంటనే మీడియా సమావేశం పెట్టి జాతీయ రాజకీయాలపై సంచలన కామెంట్ చేశారు.


ఈ నేపథ్యంలో ఇటీవల పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయన అమెరికా మరియు చైనా గురించి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ఆదేశాలు విద్యుత్ పరంగా మరియు రోడ్లు, రవాణా సరుకులు వంటి విషయాలలో  చాలా అభివృద్ధి చెందాయని కానీ మన దేశ పరిస్థితి చూస్తే గత కొంతకాలంగా దేశాన్ని పరిపాలిస్తున్న రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను వినబడుతూ మతం పేరుచెప్పి ఇంకా అనేక విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లకుండా చెత్త రాజకీయాలు చేశారని బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు కేసీఆర్. అభివృద్ధి చెందుతున్న దేశాలు చైనా మరియు అమెరికా దేశాలలో ఉన్న రైలు మన దేశంలో ఉన్న రైలు కంటే చాలా స్పీడ్ వెళ్తాయని కానీ వాటి గురించి అక్కడ ఉన్న రాజకీయ నేతలు ఏమాత్రం రాజకీయాలు పాలిటిక్స్ చేయరని అన్నారు.


ఇదే క్రమంలో భారత్ లోకి వస్తే ఏదైనా రాజకీయ నాయకుడు ఒక బ్రిడ్జి గానీ మరియు రోడ్డు గాని వేస్తే దానిని ఎన్నికల ప్రచారంలో తమ స్వార్ధ రాజకీయాలకోసం ఉపయోగించుకుంటారని దేశాన్ని అభివృద్ధి చేసినట్టు విధంగా కాకుండా ప్రతి దాన్ని రాజకీయ అంశంగా ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో ఉంటున్న రెండు పార్టీల నేతలు చేస్తారని బీజేపీ -కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ కెసిఆర్ భారతదేశం అగ్రరాజ్యంగా అగ్రదేశాలకు దీటుగా అభివృద్ధి చెందాలంటే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కలవాలని మరియు దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థలో సంస్కరణ మార్పులు రావాలని పరిపాలన విషయంలో కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలని ..రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు రాష్ట్ర ప్రభుత్వాలు  చేసే విధంగా వ్యవస్థ మారాలని భారతదేశం అప్పుడే అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: