హరీశ్ రావు బీజేపీలోకి వెళ్తున్నారంటూ ఆంగ్లపత్రిక డక్కన్ క్రానికల్ రాసిన వార్త సంచలనం సృష్టించింది. హరీష్ రావు టిఆర్ఎస్ వైఖరితో అసంతృప్తిగా ఉన్నారని,దాంతో ఆయన టిఆర్ఎస్ ను వీడవచ్చని రాసింది. బిజెపి నాయకత్వం ఆయనతో టచ్ లోఉందని, లోక్ సభ ఎన్నికల తర్వాత హరీష్ రావును బిజెపిలోకి ఆకర్షించవచ్చని అంటూ ,ఇటీవలికాలంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించింది.


ఐతే.. ఇదంతా ఏప్రిల్ ఫస్ట్ స్టోరీ అంటూ చివర్లో రాసింది. ఇలాంటివి సరదాగా ఉండాలి కాని, మరి ఇంత సీరియస్ గా రాసి హరీష్ రావుపై అనుమానం వచ్చేలా చేయడం హరీశ్ కు  కోపం తెప్పించింది. డెక్కన్ క్రానికల్ రాసిన కదనంపై మాజీ మంత్రి,టిఆర్ఎస్ నేత టి.హరీష్ రావు స్పందించారు. తప్పుడు కదనం రాసినందుకు ఆ పత్రిక క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తాను బీజేపీలో చేరబోతున్నానంటూ ప్రచురించిన కథనం అసలు సిసలైన ఫేక్‌ న్యూస్‌కు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు కథనాన్ని ప్రచురించిన పేజీలోనే.. తనకు క్షమాపణ చెబుతూ వార్తను ప్రచురించాలని ఆయన కోరారు.

దీంతో ఇబ్బంది పడిపోయిన డక్కన్ క్రానికల్.. ఈరోజు అదే స్థానంలో హరీశ్ మెదక్ హీరో అని కేటీఆర్ అన్నట్టు వార్త రాసి.. తాము నిన్న రాసిన కథనాన్ని ప్రస్తావించింది. అంటే పరోక్షంగా సారీ చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: