ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రజల ఆదరణ పొందడానికి నానా తంటాలు పిల్లి మొగ్గలు వేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు గత ఎన్నికలలో ఇచ్చిన హామీల విషయంలో ఏపీ ప్రజలకు ముందు చెయ్యి చూపించి దారుణంగా మోసం చేయడంతో 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఇప్పటిదాకా నడిపించారు అని ప్రతిపక్ష పార్టీలు మరియు ఇతర పార్టీల నేతలు కామెంట్లు చేస్తుంటారు.


ఈ నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో ఎలాగైనా మరొకసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇస్తున్న హామీలు ఇప్పుడు ఏపీ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గతంలో రాయలసీమ ప్రాంతంలో 2014 ఎన్నికలలో బుల్లెట్ ట్రైన్ లు తీసుకు వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏమీ పట్టించుకోకుండా తన స్వార్ధ రాజకీయాలు తానే చూసుకున్నారని టీడీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు కామెంట్లు చేస్తుంటారు.


ముఖ్యంగా గత ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా యువతను నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇంటికో ఉద్యోగం అంటూ జాబు రావాలంటే బాబు రావాలని అనేక విధమైన స్లోగన్లు గత ఎన్నికలలో చంద్రబాబు ప్రజలకు ఊదరగొడుతూ అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు నమ్మే స్థితిలో లేకపోవడం తో చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఏపీ ప్రజలకు స్వర్గాన్ని తలపిస్తు హామీలు ఇవ్వడం విశేషం. అయితే చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఇస్తున్న హామీలను గమనిస్తున్న ఏపీ ప్రజలు అందుకే గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబుని ఆల్ ఫ్రీ బాబు అనే పేరు పెట్టారని కామెంట్లు చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: