కృష్ణా జిల్లాలో త్రిముఖ పోరు జరిగే నియోజకవర్గాల్లో అవనిగడ్డ ఒకటి...ఇక్కడ మూడు పార్టీల అభ్యర్ధులు బలంగా ఉన్నారు. టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తుండగా...వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్...జనసేన తర‌పున ముత్తంశెట్టి కృష్ణారావు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన నేతలే కావడం విశేషం. ఇప్పటికే వీరు ప్రచారంలో దూసుకెళుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి హామీలిస్తూ ప్రజలని ఆకర్షిస్తున్నారు. ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో రూ.2వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయని.. 1000 కోట్లకు పైగా వెచ్చించి పలు అభివృద్ధి జరిగాయని..కాబట్టి ప్రజలు తననే గెలిపిస్తారని బుద్ధప్రసాద్ ధీమాగా ఉన్నారు. ఇక్కడ మండలి కుటుంబానికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈయన...టీడీపీ కార్యకర్తలని కలుపుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అటు ఎంతో కాలంగా టీడీపీలో ఉన్న దివంగత అంబటి బ్రాహ్మణయ్య కుటుంబం వైసీపీలో చేరడం కొంత ఇబ్బందనే చెప్పాలి.


అంబ‌టి బ్రాహ్మ‌ణ‌య్య కుమారుడు మాజీ ఎమ్మెల్యే అంబ‌రి హ‌రిప్ర‌సాద్ తాజాగా వైసీపీలో చేరిపోయారు. ఇక రెండుసార్లు ఓడిపోతు వస్తున్న సింహాద్రి రమేశ్ నియోజకవర్గంలో కసితో పని చేస్తూ వచ్చారు. జగన్ టికెట్ కేటాయించిన దగ్గర నుంచి రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తూ...టీడీపీ నేతలనీ పార్టీలో చేర్చుకుంటూ దూసుకెళుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో సింహాద్రి రమేష్‌కు నియోజకవర్గంలో సానుభూతి కూడా వ్యక్తం అవుతుంది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి చివ‌రి వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. అయితే జనసేన పోటీలో లేకపోతే సింహాద్రి రమేశ్ విజయం ఏకపక్షం అయ్యేది..కానీ జనసేన తరుపున బలమైన అభ్యర్ధి దిగడంతో ముక్కోణపు పోటీ ఖాయమైంది. ఆర్ధిక, అంగబలం ఉన్న ముత్తంశెట్టి కృష్ణారావుకి నియోజకవర్గంలో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ పవన్ అభిమానులు కూడా ఎక్కువే.


కాపు సామాజిక‌వ‌ర్గానికి పెట్టిన కోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున పోటీ చేస్తోన్న ముగ్గురు అభ్య‌ర్థులు ఈ వ‌ర్గానికే చెందిన వారు. ఈ నియోజకవర్గంలో మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల మండలాలు ఉన్నాయి. ఇక్కడ కాపు సామాజిక ఓటర్లు ఎక్కువ. వీరు సుమారు 70వేల వరకు ఉన్నారు. మూడు పార్టీ అభ్యర్ధులు అదే సామాజికవర్గం కావడంతో...ఓట్లు చీలిపోవడం ఖాయం. ఇక బీసీలలోని అన్నీ సామాజికవర్గాలు కలిపి 95వేలు వరకు ఉంటారు. అలాగే ఎస్సీ ఓటర్లు 41వేలు మంది ఉన్నారు. ఈ సామాజికవర్గాలే అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమీకరణల పరంగా చూస్తే ఇక్కడ మూడు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఎన్నికల్లో మూడు పార్టీలకి గెలుపు అవకాశాలు సమానంగానే ఉన్నాయి. ఇందులో ఏ పార్టీ అభ్యర్ధి గెలిచినా...అతి తక్కువ ఆధిక్యంతో బయటపడతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: