జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిననాటి నుండి కేవలం వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో మరోపక్క ఏపీ పాలిటిక్స్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి ఉన్నాయనే ఇటీవల టిడిపి నాయకులు కూడా కామెంట్లు చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తున్న రాజకీయ వైఖరి పట్ల ఆంధ్ర ప్రజలు అసహ్యం చెందుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.


ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన మహాసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ అవినీతిపరుడు అంటూ జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేని వ్యక్తి అంటూ ప్రాంతాల పరంగా విద్వేషాలను రెచ్చ గొడుతూ పవన్ కళ్యాణ్ తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని...తాను భారతీయుడు నూ తనకు కులం లేదు ప్రాంతం లేదు అని పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మహాసభలలో గతంలో ప్రసంగించి ఇప్పుడు...ఆంధ్రుల ఆత్మ గౌరవం కెసిఆర్ మోడీ కాళ్ల దగ్గర జగన్ తాకట్టు పెట్టారని ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని సీనియర్ రాజకీయ నేతలు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు.


అయితే గత సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ బీజేపీ పార్టీల తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు మోడీ పక్కన కూర్చుని ఆ సమయంలో జరిగిన ఎన్నికల ప్రచార లో పవన్ కళ్యాణ్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో మోడీ గాని చంద్రబాబు గాని నెరవేర్చకపోతే నాది పూచి అని ప్రజలకు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్...ఇప్పుడు అదే నాయకులు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తే..జగన్మోహన్ రెడ్డి ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వెటకారం గా ఉందని ఏపీ ప్రజానీకం అంటున్నారు.


ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో జగన్ ని పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలే పవన్ కళ్యాణ్ అజ్ఞానానికి నిదర్శనం అని కేవలం అభిమానుల భావోద్వేగాలను ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే పవన్ కళ్యాణ్ టార్గెట్ అని జగన్ ని ప్రజల ముందు అవినీతిపరుడిగా కనపరిచి చంద్రబాబుకు వచ్చే ఎన్నికలలో లాభం చేయవచ్చని పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశమని తణుకు లో పవన్ చేసిన కామెంట్లకు వైసిపి నేతలు కౌంటర్ లు వేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: