జూనియర్ ఎన్టీఆర్ మామగారు నార్నే శ్రీనివాసరావు ఇటీవల ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు రాజకీయ జీవితం గురించి మరియు ఆయన వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు పెళ్లి చేసింది చంద్రబాబేనని చంద్రబాబు సొంత చెల్లెలు కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేశారని చంద్రబాబు వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు అని ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి మరియు ఆయన రాజకీయ జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


రాజకీయాలలో చంద్రబాబు తాను ఒక్కడినే ఎదగాలని తన కుటుంబం నుండి ఎవరిని ఎదగనీయకుండా ఎప్పుడు తానొక్కడే రాజకీయాలను శాసించే విధంగా ఉండేటట్లు చూసుకుంటాడని సెకండ్ పర్సన్ లేకుండా.. ఒకేలా వస్తే దేనికైనా చేయడానికి వెనుకాడని వ్యక్తిత్వం చంద్రబాబుదే అని సంచలన కామెంట్ చేశారు. చంద్రబాబు సొంత తమ్ముడు మతిస్థిమితం లోకి వెళ్లి పోవడానికి గల కారణం చంద్రబాబు అని అతనికి చికిత్స కూడా బయట ఆసుపత్రిలో చేయించకుండా నిర్బంధించిన ఘనత చంద్రబాబుదేనని ఇలా అనేకమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ లో తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ మామగారు నార్నే శ్రీనివాసరావు.


ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు సొంత రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో పెద్దగా అతిశయోక్తి లేదని అన్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికలకు చంద్రబాబు ఇస్తున్న హామీలు ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అమ్మకు అన్నం పెట్టని వాడు..చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అనేలా ఉందని సెటైర్లు వేశారు. అయితే ఈసారి మాత్రం ఆంధ్ర ప్రజలు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరని గత సంవత్సరాలలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏ విధంగా కుమ్మక్కు రాజకీయాలు ప్రస్తుతం జరుగుతున్నాయి అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు నార్నె శ్రీనివాసరావు.



మరింత సమాచారం తెలుసుకోండి: