మెగా హీరోలంటే పిచ్చి అభిమానం ఉంటుంది ఫ్యాన్స్ కి. అటువంటి మెగా హీరోలను వారే అంటారా. అలా ఇలా కాదు, వార్నింగ్ ఇస్తారా వినడానికే ఇది విడ్డూరంగా ఉంది కదు. అయినా ప్రేమ ఉన్న చోటనే కదా అభిమానం ఉంటుంది మరి.


విషయానికి వస్తే విష్ణు నాగిరెడ్డి అని ఓ జనసైనికుడు తనకు తానుగా యూట్యూబ్లో అ వీడియో పెట్టి అందులో మెగా హీరోల మీద ప్రేమతో కూడిన వార్నింగ్ ను  జారీ చేశారు. జనసేన గెలవాల్సిన సీట్లు ఎన్నో ఉన్నాయి. పవన్ ఒక్కరే తిరగలేకపోతున్నారు. కాబట్టి ప్రచారానికి మెగా హీరోలు వస్తే బాగూంటని విష్ణు విన్నపం. మరి దాన్ని ఆయన కాస్త గట్టిగానే చెప్పుకొచ్చారు. ఓ వైపు టీడీపీ, వైసీపీ జనాల్లోకి దూకుడుగా వెళ్ళిపోతున్నారని, అదే టైంలో జనసేనకు మాత్రం పవన్ తప్ప మరెవరూ లేరని బాధతో కూడిన స్వరంతో చెప్పుకొచ్చారు. 


ప్రచారానికి అతి తక్కువ సమయం ఉందని, అందువల్ల పవన్  కోసం బాద్యతగా  మెగా హీరోలు ముందుకు రావాలని అయన బన్నీ, చరణ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్ లాంటి వారికి రిక్వెస్ట్ చేశాడు. ఒకవేళ మీరు ప్రచారం చేసినా పార్టీ ఓడిపోతే బాదేం పడవద్దని కూదా చెప్పుకొచ్చాడు. తామంతా అండగా ఉంటామని, జయాపజయాలతో నిమిత్తం లేకుండా ముందు బేషజాలు విడిచి ప్రచారానికి రావాలని కాస్త గట్టిగానే కోరాడు మరి. మెగా హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: