ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దుల తనయుడు మంత్రి నారా లోకేష్ 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వర్ధంతికి జయంతికి తేడా తెలియకుండా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత పెను దుమారాన్ని రేపాయో అదేవిధంగా 2019 ఎన్నికల ప్రచారంలో లోకేష్ చేస్తున్న ప్రసంగాలు వింటున్న ఆంధ్ర ప్రజలు సీరియస్ గా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న ఆంధ్ర రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎపిసోడ్ కామెడీ క్యారెక్టర్ ని తలపిస్తుందని ఏపీ ప్రజానీకం కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో.


ఇదిలా ఉండగా తాజాగా లక్ష్మీపార్వతి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో రూ. 60 కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ కు వాళ్ల నాన్న సర్టిఫికెట్ కొనిచ్చారని... ఆ సర్టిఫికెట్ ను చదవడం కూడా లోకేష్ కు రాదని ఎద్దేవా చేశారు. ఒకటో క్లాసు పరిజ్ఞానం కూడా లేని మీ కొడుక్కి ఏకంగా మూడు శాఖలకు మంత్రిని ఎలా చేశారంటూ చంద్రబాబును నిలదీశారు.


ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని... ఇంత దుర్మార్గులకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. లోకేష్ నాయకత్వం కావాలా? లేక జగన్ నాయకత్వం కావాలా? ఆలోచించుకోవాలని అన్నారు.ఎన్నికల ముందు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు నమ్మకూడదని మరొకసారి మోసపోకుండా వైసిపి పార్టీని అధికారంలోకి తెచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు సూచించారు లక్ష్మీపార్వతి.


మరింత సమాచారం తెలుసుకోండి: