ఈ మద్య నరేంద్ర మోదీ ఓ ప్రచార సభలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన బాహుబలి సినీ ప్రస్తావన తీసుకు వచ్చారు.  అందులో చంద్రబాబు నాయుడిని విలన్ క్యారెక్టర్ అయిన భళ్లాల దేవుడితో పోల్చారు.  ప్రధాని నరేంద్రమోదీ ఏ టైమ్‌లో అలా కామెంట్ చేశారో తెలియదు కానీ... అప్పటి నుంచి ఏపీ రాజకీయాలు, విమర్శలు ఎక్కువగా బాహుబలి చుట్టే తిరుగుతున్నాయి.  మోదీకి కౌంటర్ గా చంద్రబాబు నాయుడు నరేంద్రమోదీని బాహుబలి మూవీలోని బిజ్జలదేవ క్యారెక్టర్‌తో పోల్చారు.


కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన పార్టీలు ముక్కోణపు సమరంలో పోరాడుతున్నాయి.  ఈ నేపథ్యంలో టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలోనే చావో బతుకో సమరంలో సర్వశక్తులూ ఒడ్డి అధికారం నిలుపుకోడానికి తంటాలు పడుతున్నారు. ఇక  ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలే బాహుబలులు అంటూ కామెంట్ చేశారు చంద్రబాబు. మోదీ, చంద్రబాబు మధ్య జరిగిన బాహుబలి క్యారెక్టర్స్ యుద్దంలో మధ్యలో టీడీపీ యువనేత లోకేశ్ కూడా ఎంటరయ్యాడు.  


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అడ్డుపడుతున్న మీరు కాలకేయుడు లాంటివారని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.  ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రంగంలోకి దిగారు.. చంద్రబాబు బాహుబలి అయితే...ఆయను కత్తితో  పొడిచే కటప్పవు నీవే అంటూ లోకేశ్‌పై సెటైర్లు వేశారు.  ఏది ఏమైనా ఇప్పుడు ఏపిలో రాజకీయాలు ‘బాహుబలి’ సినిమా క్యారెక్టర్స్‌తో నేతలు చేస్తున్న విమర్శలు ఇక ముందు కొనసాగుతాయో లేక ఎన్నికల ప్రచారం ముగిసేవరకు కంటిన్యూ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: