సినీనటుడు, వైసిపి నేత మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్టు జైలుశిక్ష విధించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తు ఈ రోజు తీర్పు చెప్పింది.  2010లో ఓ పారితోషికంకు సంబంధించిన వివాదంలో నిర్మాత వైవిఎస్ చౌధరి మోహన్ బాబుపై కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మోహన్ బాబును కోర్టు దోషిగా తేల్చింది.

 

 చౌధరికి మోహన్ బాబు రూ 48 లక్షలు బాకీ పడ్డారట. దానికిగాను మోహన్ బాబు చెక్ ఇచ్చారు చౌధరికి. అయితే ఆ చెక్ ను బ్యాంకులో వేసినపుడు బౌన్స్ అయ్యింది. దాంతో చౌధరి కేసు వేశారు. ఆ కేసులోనే మోహన్ బాబు ఏడాది జైలు శిక్షతో పాటు రూ 41. 75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.

 

సరే కోర్టు తీర్పిచ్చినంత మాత్రానా వెళ్ళి జైలులో కూర్చాంటారా ఎవరైనా ? అలాగే మోహన్ బాబు కూడా బెయిల్ పిటీషర్ వేశారు లేండి.  అయితే బెయిల్ పిటీషన్ పై కోర్టు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కాబట్టి మోహన్ బాబు కుటుంబసభ్యులు కూడా  ఈ విషయమై ఇంత వరకూ రియాక్ట్ కాలేదు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: