లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే మ్యానిఫెస్టోను సిద్ధం చేసిన ఆ పార్టీ.. నేడు రాహుల్ చేతుల మీదుగా మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రాహుల్ గాంధీ కోర్ టీం లోని సీనియర్ నేతలు ఈ మానిఫెస్టోకు రూపకల్పన చేశారు.  దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు.


కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ మానిఫెస్టోలో ముఖ్యంగా ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల బలోపేతంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.  హ‌మ్ నిభాయేంగే(మేం నెర‌వేరుస్తాం) పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు.ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు.  


ఇక దేశంలో అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందిస్తూ న్యాయ్‌ పేరిట ఆ పార్టీ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పధకం కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హైలైట్‌గా నిలవనుంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్‌దీప్‌ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.


మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు:

గ్రామ పంచాయితీల్లో 10లక్షల ఉద్యోగాలు

రైల్వే బడ్జెట్ మాదిరిగానే వ్యవసాయ రంగం కోసం ప్రత్యేక బడ్జెట్( కిసాన్ బడ్జెట్) అమలు

ఎడ్యుకేషన్‌కు 6శాతం జీడీపీ

ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు బలం చేకూర్చడం. అమెరికాలో తరహాలో కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లటం.

దేశవ్యాప్తంగా స్త్రీల భద్రతకు చర్యలు

దేశంలో 20శాతం మందికి 'న్యాయ్' పథకం(పేదవారి ఖాతాలో ప్రతీ నెల రూ.6వేలు) అమలు

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా

యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు


మరింత సమాచారం తెలుసుకోండి: