వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ గత సార్వత్రిక ఎన్నికలలో ఒక్క హామీ ఇచ్చి ఉండి ఉంటే ఈ పాటికి ముఖ్యమంత్రి అయి ఉండే వారిని చాలామంది రాష్ట్రంలో ఉన్న నేతలు వైసిపి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంటుంటారు. రైతు రుణమాఫీ అని జగన్ ఆనాడు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉంటే ఈపాటికి చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఉండేది కాదని చాలా మంది విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తుంటారు. అయితే ముందు నుంచి జగన్ రాజకీయ వ్యవహారశైలి చూస్తుంటే రైట్ అండ్ క్లియర్ పాలిటిక్స్ చేస్తూ తాను ఏది చేయగలడో ఆ హామీలనే ఇస్తూ ముక్కుసూటిగా అధికార పార్టీ టీడీపీ వేస్తున్న వ్యూహాలను ఎదుర్కొంటూ మరోపక్క అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు గుంటనక్క రాజకీయాలను బయట పెడుతూ 2019 ఎన్నికలకు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అద్భుతంగా వైసిపి పార్టీని ఆవిష్కరించారు.


ఇటువంటి క్రమంలో జగన్ టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆంధ్ర ద్రోహులు కెసిఆర్ , కేటీఆర్ తో కలిసి జగన్ ఆంధ్రులను మోసం చేస్తున్నారు అంటూ ఇటీవల ప్రత్యర్థి పార్టీల నాయకులు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో తెగ ఊదరగొడుతున్నారు. ముఖ్యంగా జగన్ తన స్వార్ధ రాజకీయాలకోసం ఆంధ్రులను మోసం చేసిన దూషించిన కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా జగన్ పై ఆంధ్రుల ద్రోహి అనే ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి మనకందరికీ తెలిసినదే.


అయితే ఒక్కసారి ఇక్కడ గమనిస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదా రావాల్సిందే ముఖ్యంగా ఈ విభజన హామీ విషయంలో చంద్రబాబు చేసిన పని వల్లే ఈనాడు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా అనే హామీని కోల్పోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అని చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలను పొగిడారు. అయితే ఇంతటి పెద్ద విభజన హామీ పార్లమెంటు దక్కించుకోవాలంటే కచ్చితంగా పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రం పట్ల వాయిస్ వినిపించే మద్దతు తెలిపే పార్లమెంటు సభ్యులు ఉండటం అత్యవసరం.


ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న వైయస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న సమీకరణాలు మరియు ప్రజలంతా వైసిపి పార్టీని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో విద్వేషాలను ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి ఒక గౌరవప్రథమైన రాజకీయ నేతగా  సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ స్వయంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని చెబుతున్న క్రమంలో తోటి తెలుగు రాష్ట్ర రాజకీయ నేతలు కలుపుకోవడంలో మరియు రాష్ట్రానికి మేలు చేకూరే విషయంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషదాయకమని ఏపీ ప్రజలు కెసిఆర్ తో కలిసి జగన్ వేస్తున్న రాజకీయ అడుగులు నిజంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు అడుగులు అని కామెంట్లు చేస్తున్నారు.


మరోపక్క సొంత బామ్మర్ది హరికృష్ణ శవాన్ని పక్కనపెట్టుకుని అదే కెసిఆర్తో తెలంగాణ ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ ఆంధ్రుల ద్రోహి కెసిఆర్ తో కలవరిస్తున్నారు అని చెబితే నమ్మే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లేరని రాబోయే రోజుల్లో 2014 ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆంధ్ర ప్రజలను మోసం చేసి న్యాయబద్ధంగా విభజన చట్టంలో ఉన్న హామీల విషయంలో ఆంధ్ర ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ప్రతి ఒక్కరికి గుర్తు ఉంది...అంటూ మాట్లాడుతూ అసలు ముందు నుండి ప్రత్యేక హోదా నుండి ఒకే ఒక్క మాట పై ఉన్న నేత రాజకీయ నాయకుడు వైయస్ జగన్ అని ఇదే విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ యువత ఏపీ ఫర్ స్పెషల్ స్టేటస్ అంటూ విశాఖపట్టణం లో స్వచ్ఛందంగా పిలుపునిచ్చిన క్రమములో ఆంధ్ర యువత ఉద్యమాన్ని అణచి వేశారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు.


అయితే మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఒక్క అడుగు కూడా కాలు కూడా బయటకు పెట్టలేదు. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష నేత జగన్ ప్రజలు నమ్ముతున్న ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామని ప్రజలతో కలిసి ప్రత్యేక హోదా యొక్క ప్రాధాన్యతను రాష్ట్ర అధికారానికి తెలియజేసే విధంగా అడుగులు వేస్తున్న క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో నిర్బంధించారు వైసీపీ అధినేత జగన్ ని....కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు దక్కించుకొని పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం ఖాయమని అంటున్నారు ఏపీ ప్రజలు.


అసలు జగన్ ఆంధ్ర ద్రోహి అనే చంద్రబాబు విభజన సమయంలో ఏమైపోయారు అని ప్రశ్నిస్తున్నారు...ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన సమయంలో విభజనను వ్యతిరేకించిన నాయకుడు జగన్ అంటూ ఏకంగా పార్లమెంటులో విభజన వద్దు అనే స్లోగన్ బోర్డు పట్టుకుని పార్లమెంటులో నిరసన తెలియజేశారు అని...ఆంధ్రుల ద్రోహి జగన్ అని చెప్పడానికి నోర్లు ఎలా వస్తున్నాయి అని జగన్ పై బురద జల్లుతున్న నాయకులను విమర్శిస్తున్నారు ఏపీ ప్రజానీకం. జగన్ కెసిఆర్ ,కేటీఆర్ తో కలిసి కేవలం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే ముందుకు వెళుతున్నారని బలంగా నమ్ముతున్నామని ఏపీ ప్రజలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: