10 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు జగన్ మీద తాము కూడా ఆరోపణలు చేశాం కాని ఒక్కదానికి ఆధారాలు లేవు. కాని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చంద్రబాబుకు జగన్ ను అనే అర్హత లేదని అంటున్నారు జీవిత రాజశేఖర్. రీసెంట్ జగన్ ను కలిసి వైసిపిలో చేరిన రాజశేఖర్, జీవితలు ప్రెస్ మీట్ లో ఏపిలో సిఎంగా జగన్ ను మనం గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.    


పదేళ్ల క్రితం మేము జగన్ ను విమర్శించిన వాళ్లమే.. మేము మారాం అంటే దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. జగన్ మీద పెట్టినవన్ని తప్పుడు కేసులని వాటికి అసలు ఎలాంటి ఆధారాలు లేవని అందుకే ఆయన్ను ఏమి చేయలేకపోతున్నారని అన్నారు. ఇక ఇన్నాళ్ల పరిపాలనలో బాబు చేసిన అక్రమాలు అన్ని ప్రజలకు తెలుసని.. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటెయ్యాలని అన్నారు. 


ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న ప్రముఖులంతా కూడా వైసిపికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇక ప్రతిసారి తాము పార్టీ మరుతున్నామని వస్తున్న కామెంట్స్ కు సమాధానంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిసారి ఒకరికే ఓటు వేయాలన్న రూల్ లేదని ఎవరు మంచి చేస్తారని అనిపిస్తే వారికి ఓటేస్తారని.. తాము ఎంచుకున్న పార్టీ సరిగా పనిచేయట్లేదని తెలిస్తే ఆ పార్టీని వీడి మంచి చేసే పార్టీలో చేరడంలో తప్పేం లేదని అన్నారు.


ఏప్రిల్ 11న జరిగే ఏపి ఎలక్షన్స్ లో జగన్ ను సిఎంగా చేయాలన్న దృడ నిశ్చయంతో ఏపి ప్రజలు ఉన్నారని.. ఈ ఎన్నికల్లో వైసిపి అత్యధిక సీట్లు గెలిచి ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైసిపి నేతలు చెబుతున్నారు. జగన్ పేరు వినగానే ప్రజల నుండి వచ్చే స్పందనని బట్టే వచ్చేది జగన్ పాలనే అంటూ చెప్పుకుంటున్నారు.      



మరింత సమాచారం తెలుసుకోండి: