భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఏంతగా గౌరవ మర్యాదలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అలాంటీ ఉన్నతమైన హోదాలో ఉన్న నరేంద్ర మోదీ కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ క్షమాపణలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగిన విజయ్‌ సంకల్ప్‌ సభ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు.   

ఈ సందర్భంగా దత్తాత్రేయ తలవైపు చూస్తూ.. హోలీ తర్వాత రెండు మూడు నెలల వరకు మీ జుత్తు ఎర్రగా ఉండేదని, ఇప్పుడు తెల్లగా ఎందుకుందని ప్రశ్నించారు. 

దానికి బండారు దత్తాత్రేయ తన కుమారుడు చనిపోవడంతో ఆ బాధలో హూలీ ఆడలేదని..అందుకే తన జుత్తు తెల్లగా బదులివ్వడంతో మోదీ అయ్యో అంటూ బాధపడ్డారు. ఆ వెంటనే క్షమించాలని, తనకు ఆ విషయం జ్ఞాపకం లేకపోవడం వల్లే అలా ప్రశ్నించానని, ఏమీ అనుకోవద్దని మోదీ కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: