భీమవరం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. అక్కడ పవన్ పోటీలో ఉండడమే అందుకు కారణం. పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గాజువాకలో కూడా ఆయన బరిలో ఉన్నారు. అయితే భీమవరం పవన్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి కావడంతో ఆసక్తి మెండుగా ఉంది. భీమవరంలో వైసీపీ బలంగా ఉంది. ఆలాగే మంత్రి గంటా వియ్యంకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరా, ఏకపక్షమా అన్నది ఇంటెరెస్టింగ్ పాయింట్ గా ఉంది.


ఇదిలా ఉండగా భీమవరంలో వైసీపీ అధినేత జగన్ పర్యటించినపుడు పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. ఓ విధంగా చెప్పాలంటే ఫ్యాన్ గాలి బాగా వీచింది. కనుచూపు మేరంతా జనమే జనంగా కనిపించారు. మరి ఆ జోష్ లో జగన్ అటు టీడీపీ మీద, ఇటు అభ్యర్ధి పవన్ మీద కూడా సెటైర్లు వేశారు. పార్టనర్, , యాక్టర్ అంటూ పవన్ని మరో మారు కవ్వించారు.


మీకు అయిదేళ్ళూ అందుబాటులో ఉండే రియల్ హీరో, వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ కావాలా, లేక రీల్ హెరో కావాలా అంటూ పవన్ మీద ఇండైరెక్ట్ గా జగన్ సెటైర్లు వేశారు. భీమవరం సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వైసీపీ అభ్యర్ధిని ఎన్నుకోవాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. మరి అక్కడకు వచ్చిన జనం కేరింతలు, జగన్ సెటైర్లు చూస్తే పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: