ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి పార్టీ హవా స్పష్టంగా కనబడుతుంది. జగన్ ఎన్నికల ప్రచారం లో వస్తున్న జనాన్ని చూసి ప్రత్యర్థి పార్టీల రాజకీయ నేతల వెన్నులో వణుకు పడుతున్నట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్ వినపడుతోంది. ముఖ్యంగా జగన్ ఎన్నికల సమయంలో జాతీయ మీడియా ఛానల్ రిపోర్టర్ ఓ సభకు వచ్చిన జనాన్ని చూసి నేను ఇంటర్వ్యూ చేసేది నెక్స్ట్ ఏపీ సీఎం నేనా అని జగన్ ఇంటర్వ్యూ తీసుకున్నారు.


ఇటువంటి తరుణంలో ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీనియర్ జర్నలిస్ట్  వ్యాకరణం నాగేశ్వర రావు జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో జగన్ కి అనుభవం లేదని పక్కన పెట్టిన ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు జగన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో ఏ విధంగా పోరాడారు వంటి విషయాలను బాగా గమనించారని ముఖ్యంగా అనుభవం ఉంది అని అందలం ఎక్కించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని బలంగా ఏపీ ప్రజల గుండెల్లో నాటుకుపోయిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


అంతే కాకుండా సామాన్య జనం లోకి జగన్ అద్భుతంగా తన పాదయాత్రతో కలిసిపోయారని కింది స్థాయిలో ఉన్న గ్రామీణ ప్రజలు ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అని డిసైడ్ అయిపోయారు అని మరియు అదే విధంగా చంద్రబాబు పరిపాలన గతంలోలా లేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్ట్ వ్యాకరణం నాగేశ్వర రావు.



మరింత సమాచారం తెలుసుకోండి: