నెల్లూరు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్..వైసీపీ యువ నాయకుడు మాటలే కాదు చేతలు కూడా వాడీ-వేడీగా ఉంటాయన్న పేరు ఉంది.  అనీల్ నెల్లురు పేద ప్రజల కోసం చాలా సార్లు రోడ్డెక్కిన ఎమ్మెల్యే. 


నెల్లూరంటే ఎంత అభిమానమో - జగన్ అంటే కూడా అంతకు మించి అభిమానం చూపే ఈ నాయకున్ని నెల్లూరే కాదు యావదాంధ్ర యాదవులు, వైసీపీ అభిమానులు అభిమానిస్తుంటారు.


ఈసారి 2019 ఎన్నికలలో అనీల్ కుమార్ యాదవ్ ఢీ కొనేది మంత్రి,  అతి పెద్ద విద్యా సంస్థల అధినేత, అత్యంత ధనిక రాజకీయ నాయకుడు నారాయణ.   ఒక విధంగా చెప్పాంటే నారాయణ అంటే  మందీ, మార్భలం, హంగూ-అండ అన్నింటికి మించి బాబు కోటరీలో అత్యంత ప్రముఖుడు, ముఖ్యుడు.


అల్లాంటి ప్రత్యర్థితో తలపడుతున్నపుడు అనీల్ కుమార్ యాదవ్ ను ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్ని రకాలుగా టార్గెట్ చేస్తోంది తెదేపా...అయినా మొక్కవోని ధైర్యంతో కొట్టిన దిక్కుకే నడిచే స్కార్పియన్ లా అనిల్ కుమార్ యాదవ్ ప్రచారం కొనసాగిస్తున్నారు.  తప్పని సరిగా గెలుస్తానంటున్నాడు, గెలిస్తే మాత్రం యువ నాయకుడి నుంచి సీనియర్ అవ్వడం ఖాయం . అలాగే మంత్రి నారాయణ విజయమేమో నల్లేరు మీద నడక కాదండోయ్..



మరింత సమాచారం తెలుసుకోండి: