ఎన్నికల్లో గెలవడానికి సవాల లక్ష మార్గాలు ఉంటాయి. అలాగే ఒకరిని ఓడించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉంటాయి. రాను రాను ఎన్నికల్లో అక్రమాలు బాగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకపుడు బూత్ లెవెల్ల్లోనే కాస్త అల్లర్లు జరిగేవి. ఇపుడు చూస్తూంటే ప్రచారంలోనే వాటికి తెర లేపుతున్నారు.


చిత్తూరు జిల్లా చంద్రగిరి అంటే అందరికీ గుర్తు వచ్చేది చంద్రబాబు రాజకీయ జీవితం ఆరంభం. ఆయన సొంత వూరు ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ 1978లో మొదటిసారి గెలిచిన చంద్రబాబు 1983లో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన కుప్పం వెళ్ళిపోయి అక్కడ నుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇక చంద్రగిరిలో కాంగ్రెస్ తరువాత బాగా బలపింది.  ఇక 2014 నాటికి ఇక్కడ వైసీపీ పట్టు సాధించింది. తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు.


అయనకు ఆదరణ బాగుంది. దాంతో మరో మారు గెలుస్తారని కూడా సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన మీద నిలబడిన టీడీపీ అభ్యర్ధి పులవర్తి నాని అనుచరులు తాజాగా చెవిరెడ్డి  ప్రచారాన్ని అడ్డుకున్నారు. అయితే వారు అక్కడి వారు కాదు. ఇతర ప్రాంతల నుంచి తీసుకువచ్చి దాడి చేయించారు. ఏకంగా కర్రలు పట్టుకుని మరీ చెవిరెడ్డిని ప్రచారానికి రావద్దు అంటూ దాడి చేశారు. దాంతో అక్కడే బైఠాయించి చెవిరెడ్డి ఆందోళన చేపట్టారు.


ప్రజాస్వామ్యంలో ఇలాంటివి దారుణమని ఆయన అన్నారు. ఇదంతా మంత్రి లోకేష్ ఆదేశాలతోనే జరుగుతోందని కూడా చెవిరెడ్డి దుమ్మెత్తి పోశారు. ఇక్కడ గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని కూడా ఆయన ఆరోపించారు, మరి ప్రచారంలోనే అభ్యర్ధిని రానీయకపోతే రేపటి రోజున ఓట్లు దగ్గరుండి వేయించుకునేందుకు కూడా రెడీ అయిపోతారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉన్నారని చెవిరెడ్డి ఆరోపించడంతో దీని వెనక టీడీపీ పక్కా ప్లాన్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: