సీనియర్ జర్నలిస్ట్ వ్యాకరణం నాగేశ్వర రావు గారు ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి చాలా స్పష్టమైన, క్షుణ్ణమైన వివరణ ఇచ్చారు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల సమయంలో ఉన్న ఒకేఒక్క టాపిక్, జగన్ ఒక అనుభవలేమి నాయకుడని, బాబు మూడు దశాబ్దాలు పైగా రాజకీయ అనుభవం ఉన్న సిద్ధహస్తుడు అని.

అయితే ప్రస్తుతం జగన్ ఆ ట్యాగ్ లైన్ ను తొలగించుకొని, పాదయాత్ర ద్వారా జనాలకు అతి దగ్గరగా వారితో మమేకమైన విషయాన్ని గుర్తు చేశారు. జనాలు ఇలాంటి కాన్సెప్ట్ లకు చాలా తేలికగా కనెక్ట్ అవుతారని ఆయన అన్నారు. అలాగే జగన్ ఒక యువ నాయకుడిగా కాకుండా చాలా అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఈ అయిదేళ్ళు రాష్ట్రాన్ని ప్రభావితం చేశారు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక పోతే చంద్రబాబు ఒక కులానికి మేలు చేయడం, ఎక్కువ సీట్లు కేటాయించడం వంటి ఎన్నో ప్రతికూల అంశాలు ఇప్పుడు జగన్ కు అనుకూలంగా మారాయని ఆయన అన్నారు. వీటన్నిటి మధ్య జగన్ రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి అని తేల్చి పారేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: