ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ మీడియా మిత్రులతో సంభాషిస్తూ అధికార పార్టీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. ఈ పనులు అన్ని కేవలం తమ ఉనికి నిలపెట్టుకోవడనికే అంటూ ఆమె అన్నారు. అలాగే ఇలాంటి విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతాయి కాబట్టి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

మనం సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయాం అని, ఏది లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ లేకపోతే రోజు గడవదు అన్నట్టు ఐపోయామని అన్నారు. అందుకే అధికార పార్టీ వాళ్ళు సోషల్ మీడియా నే టార్గెట్ చేస్తూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు అంటూ ఆమె చెప్పారు.సినీనటుడు అలి వైసీపీ లో చేరిన విషయం అయి జయసుధను ఒక విలేఖరి ప్రశ్నించగా, దానికి సమాధానంగా ఏ పార్టీ లో తమ విలువ తగ్గట్టు గౌరవం లభిస్తుందో ఆ పార్టీలో ఉండడానికే ఎవరైనా ఇష్టపడతారని అలి కూడా అలానే చేశాడంటూ ఆమె చెప్పారు.

పార్టీలు మారడం అనేది కొత్తేమీ కాదని పపెద్ద పెద్ద రాజకీయా దిగ్గజాలు కూడా 24 గంటలలో పార్టీ ల్లు మారిన ఉదంతాలు ఉన్నాయి అంటూ ఆమె గుర్తుచేశారు. అలాగే అలి మారడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. టీడీపీలో 10 ఏళ్ళు గా పార్టీ కోసం పని చేసిన తగిన క్యాడర్ అలి దక్కలేదని కాబట్టి జగన్ ఇచ్చిన హామీతో వైసీపీ లో చేరారని ఆమె చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: