కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వైసీపీ నేత మోహన్ బాబు కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇక విషయం లోకి వెళితే 2010 లో వైవియస్ చౌదరీ, మోహన్ బాబు పై వేసిన చెక్ బౌన్స్ కేసు 9 ఏళ్లుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసు ఎన్నో వాదోపవదాలు జరిగి ఇంత కాలం ఆ కేసు కోర్టు లోనే కాలం గడిపింది.అయితే నేడు ఆ కేసుకు ఎండ్ కార్డ్ పడింది.

ఏర్రమంజలి కోర్ట్ లో విచారణలు జరిపిన అనంతరం సినీనటుడు మరియు వైసీపీ నేత మోహన్ బాబు పై ఏడాది పాటు జైలు శిక్ష విధించినట్టు కోర్ట్ ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇవ్వాల్సిన మొత్తం డబ్బు 41.5 లక్షలు కూడా తిరిగీవ్వలంటు కోర్ట్ తెలిపింది.అయితే దీని మోహన్ బాబు బెయిల్ కోసం కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది. బెయిల్ రావడానికి ఇంకా 30 రోజులు గడువు ఉంటుంది. ఈ 30 రోజులలో బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం పై స్పష్టత వస్తుంది.ఈ కేసు దాదాపు గా 9 ఏళ్లుగా నడుస్తువస్తుంది.

మోహన్ బాబు వారి లక్ష్మిప్రసన్న ప్రొడక్షన్స్ వారు వైవియస్ చౌదరి కి చెక్ ఇచ్చారు. ఆ చెక్ కాస్త బౌన్స్ అవ్వడం తో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు తీర్పు లో A1 గా ఉన్న లక్ష్మిప్రసన్న ప్రొడక్షన్స్ కు 10 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే A2 అయిన మోహన్ బాబు కు ఏడాది జైల్ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: