వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో ప్ర‌స్తుతం త్రిముఖ పోటీని ఎదుర్కొంటోంది. ఆ త్రిముఖ పోటీ తెలుగుదేశం, జ‌న‌సేన‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య‌నే అన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన చీల్చేట‌టువంటి ఓట్లు, సాధించేట‌టువంటి సీట్లు తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తాయా లేక‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తాయా అన్న ప్ర‌శ్న‌ల‌కు రానున్న రోజుల్లో ఓట‌ర్లే తేల్చాల్సి ఉంది.అందులో కీల‌క‌మైన అంశం ఏమిటంటే? అస‌లు ఇలాంటి ప‌రిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్ల‌ను గెలుపొందుతుంది.

ఆ పార్టీ అస‌లు ఏ లెక్క‌న అధికారంలోకి వ‌స్తుంద, అన్న ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు తెస్తే ఆ పార్టీకి సంబంధించిన సీనియ‌ర్ నేత‌లు చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.అనంత‌పురం నుంచి గుంటూరు వ‌ర‌కు, అంటే రాయ‌ల‌సీమ నుంచి కోస్తాలో ఉన్న‌టువంటి గుంటూరు జిల్లా వ‌ర‌కు చూసుకుంటే గ‌తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఊర‌ట‌నిచ్చే సీట్లు ఈ ప్రాంతం నుంచే వ‌చ్చాయి. మొత్తం 91 సీట్లకు గాను గతంలో 48 సీట్లను గ‌తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అనంత‌పురం జిల్లా పూర్తిగా మూడంతుల వ‌ర‌కు తెలుగుదేశం వ‌శ‌మైంది.

మిగ‌తా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70 ప‌ర్సెంట్ వ‌ర‌కు డామినేట్ చేసింది.ఈ ద‌ఫా అనంత‌పురం నుంచి గుంటూరు వ‌ర‌కు ఉన్న సీట్ల‌లో వైసీపీ మొత్తంగా 71 స్థానాల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ గెలుపొందే అవ‌కాశం ఉంది. అలాగే విజ‌య‌వాడ నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కు అంటే కోస్తాతోపాటుగా ఉత్త‌రాంధ్ర మొత్తం లెక్కేసుకుంటే 86 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ 86 స్థాన‌ల్లో గ‌తంలో వైసీపీ కేవ‌లం 26 స్థానాల‌ను మాత్ర‌మే సాధించింది. ఈ ద‌ఫా 35 స్థానాల వ‌ర‌కు సాధిస్తామ‌ని వైసీపీ గెల‌వ‌నుంది.ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న‌టువంటి 35 స్థానాల్లో తొమ్మిది నుంచి ప‌ది స్థానాల వ‌ర‌కు వైసీపీకి రావ‌చ్చు.

ప‌ది నుంచి 12 స్థానాల వ‌ర‌కు రావ‌చ్చ‌న్నది మ‌రొక అంచ‌నా. ఈ లెక్క‌న ద‌గ్గ‌ర ద‌గ్గ‌రా 106 ఎమ్మెల్యే స్థానాలు, కోస్తాలో కూడా మ‌రికొంత డెవెల‌ప్ అయితే ఇంకో నాలుగు సీట్ల‌ను గెలుచుకునే అవ‌కాశం ఉంది. మొత్తం 110 సీట్లను వైసీపీ సాధిస్తుంద‌ని ప‌లు స‌ర్వేలు పూర్తి ఆధారాల‌తో స‌హా చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: