2019 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటు జగన్ కు, చంద్రబాబుకు ఇద్దరికీ చావోరేవో తేల్చుకోవాల్సిన విషయం. అయితే ఇప్పటికే పలు సర్వేలు వైసీపీదే విజయమని తేల్చేశాయి. టీడీపీకి చావు దెబ్బ తప్పదని చెప్పుకుంటూ వచ్చాయి. అయితే చంద్రబాబు ఓటమి భయం తో జగన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వు రాక మానదు.  ఎన్నికల వేళ బాబుగారికి పీక్స్ కు చేరిపోయింది. ఆయన ఏమంటున్నారంటే.. జగన్ పేరులోనే గన్ ఉందట! కాబట్టి జగన్ కు ఓటు వేయొద్దట! ఇదీ చంద్రబాబుగారి తాజా భాష్యం.


ఎన్నికల ప్రచారానికి ఇంకా ఏడెనిమిది రోజుల సమయం ఉన్నట్టుంది. ఆలోపు ఇంకా ఏమేం మాట్లాడతారో కానీ.. ఆఖరికి జగన్ పేరు మీద కూడా బాబు కెళికేశారు. జగన్ పేరులో గన్ ఉంది కాబట్టి.. ఆయన పేరుకు అంతా భయపడిపోవాలని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటే.. అది ఆయన వీరాభిమానులను ఎంటర్ టైన్ చేస్తుందేమో కానీ, కాస్త ఆలోచించే వాళ్లకు చంద్రబాబు నాయుడుకు ఏమైంది? అని అనుకుంటున్నారు. జగన్ పేరు ఏమీ అరుదైంది కాదు... జగన్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని లక్షల మంది ఉంటారో.


ఊరికి ఒకరిద్దరు అయినా ఈ పేర్లతో ఉంటారు. అలాంటిది వాళ్లందరూ గన్నులు పట్టుకున్నట్టేనా! పేరులో గన్ పలికితే వాళ్లందరికీ జనాలు భయపడిపోవాలా.. భయపడిపోవాలని అంటున్నారు చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా ప్రముఖ వ్యక్తి వ్యాకరణం నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా మార్పు కొట్టుకుంటున్నారని చెప్పాడు. చంద్రబాబు సీఎం అవ్వటం అసాధ్యం అని తేల్చి చెప్పాడు. 

video link :

https://www.youtube.com/watch?v=05dpzEoulOo&feature=youtu.be

మరింత సమాచారం తెలుసుకోండి: