జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లాజిక్కులు ప్రజలకు ఒక పట్టాన అర్థం కావు.. ఆవేశంలో అరిచేసి చెప్పేస్తే..జనం నమ్మేస్తారన్నది బహుశా ఆయన విశ్వాసం అయిఉంటుందని కొందరు విశ్లేషిస్తారు. పాపం.. ఆయన తనకు టీడీపీతో లోపాయకారీ ఒప్పందం లేదని ఎంత చెబుతున్నా.. ఇలాంటి లాజిక్కులు వాటిని నమ్మే అవకాశం కల్పించడం లేదు. 


ఉదాహరణ.. జగన్ పై పవన్ తరచూ విరుచుకుపడుతుంటారు. ఆర్థిక నేరగాడని... లక్ష కోట్లు అక్రమంగా సంపాదించాడని.. కోర్టు కేసులున్నాయని తరచూ సభలో ఊదరకొడుతుంటారు. నిజమే.. ఆ కేసుల వల్లనే తాను జగన్‌ను కలవడం లేదని కూడా చెబుతుంటారు పవన్ కల్యాణ్. 

సరే.. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి.. కేసులు ఉన్నవారిని కలవకూడదని పవన్ నిర్ణయించుకుంటే దాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అదే వైఖరి అన్ని సందర్భాల్లోనూ ఉండాలి కదా.. ఇటీవల పవన్ కల్యాణ్ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కోసం ఆయన ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లి మాయావతిని కలిశారు. 

ఆ సందర్భంగా ఆమెను పలకరించిన సందర్భంలో పవన్ కల్యాణ్‌ అపరిమితమైన భక్తితో మాయావతి కాళ్లకు నమస్కరించారు. పాపం.. ఆ సమయంలో పవన్ కు మాయావతిపై ఉన్న ఆర్థికపరమైన కేసులు గుర్తుకు వచ్చినట్టు లేవు. గుర్తొచ్చినా ఏపీలో బీఎస్పీ ఓట్లు వాటిని మరచిపోయేలా చేశాయేమోనని సెటైర్లు పేలుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: