రామోజీరావు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంత శక్తివంతమైన వ్యక్తి మరొకరు కనిపించరు. మీడియా అధిపతిగా, పారిశ్రామికవేత్తగా ఆయన తెలుగువారికి సుపరిచితులు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఆయన నేరుగా రాజకీయాల్లో లేకపోయినా.. తాను కాంగ్రెస్‌కు వ్యతిరేకమని గతంలో ఆయన పత్రికలోనే ఆయన రాసుకున్నారు. 


ఈనాడు, ఈటీవీ ఎల్లో మీడియా అంటూ అప్పట్లో సీఎంగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఇప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అనేవారు. కానీ ఇక్కడే ఇంకో రహస్యం ఉంది. కాంగ్రెస్ నాయకుల్లో ఆయనకు ఉన్నంత పలుకుబడి వేరే ఎవరికీ లేదట. ఈ రహస్యాన్ని  మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..   
ఆయన యాంటీ కాంగ్రెస్ అని అనుకుంటాం.. కానీ కాంగ్రెస్‌లో ఆయనకు ఉన్నంత పలుకుబడి ఎవరికీ లేదు..ఆయన డెవలప్‌ మెంట్ అంతా కాంగ్రెస్సే. కాంగ్రెస్‌లో ఎవరూ ఆయన్ను ఏమాట అనలేరు.. నేనే అన్నాను.. అది కూడా.. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి అనగలిగాను కానీ... ఇంకొకరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అనే సమస్యే లేదు. 

మార్గదర్శి ఇష్యూలో.. నేను అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కు ఫిర్యాదు చేశాను. సాయంత్రానికి ఈయన  స్క్రీన్ మీదకు వచ్చాడు. లేకపోతే ఈ ఇష్యూ పక్కకుపడిపోయేది. చిదంబరమే ఆయనకు హెల్ప్ చేసేవాడు. ఇండియాలో సింగిల్ ఇండివిడ్యువల్ ఇంత పవర్ ఫుల్ ఇంకెవరూ లేరు.. 
ఎందుకు రామోజీరావు వెంట పడుతున్నావని అద్వానీ పిలిచి అడిగారు.. అదేరోజు సోమ్‌నాథ్ చటర్జీ పిలిచి అడిగారు..

నేను ఎలాగూ కాంగ్రెస్ వాళ్లు చెప్పినా వినడం లేదు. కానీ ఈ ఇద్దరూ ఒకరు బీజేపీ.. మరొకరు సీపీఎం.. ఒకరినొకరు చూసుకోని వీరిద్దరికీ రామోజీ కావలసిన వాడే. మరి ఆయనతో పోరాటానికి నేనెంతవాణ్ని.. రామోజీ రావు జనం సొమ్ము తిన్నాడని నేను ఎప్పుడూ అనలేదు.. కాకపోతే ఆయన చట్టబద్దంగా వ్యాపారం చేయలేదన్నదే నా ఆరోపణ. 


మరింత సమాచారం తెలుసుకోండి: