జీరో బడ్జెట్ పాలిటిక్స్.. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టిన కొత్త పదం. రాజకీయాల్లో రావాలంటే.. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికవ్వాలంటే కోట్ల కు కోట్లు ఖర్చు పెట్టాల్సివస్తోంది. అలాంటి రాజకీయం మారుస్తానంటూ వచ్చిన పవన్ కల్యాణ్ రాజకీయాలకు డబ్బుతో పని లేదంటున్నారు. 


ఐతే.. పవన్ కల్యాణ్ ఛార్టర్ ఫ్లైటుల్లో తిరుగుతుంటారు. హెలికాప్టర్లలో ప్రచారం చేస్తుంటారు. మరి వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.. ఇదే ప్రశ్న ఆయన సోదరుడు, నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబును అడిగితే.. ఆయన ఇలా సమాధానం చెప్పారు.

ఛార్టర్ ఫ్లయిట్‌కు కోట్లు అవసరం లేదు.. ఛార్టర్ ఫ్లయిట్ బుక్ చేసుకోవడం అంత ఖర్చయిన వ్యవహారమేమీ కాదు.. ఇవాళ రెండు లక్షలు పెడితే ఫ్లయిట్ వస్తుంది.. పది మంది వెళ్తారు..  అయినా కల్యాణ్ బాబు అంటే ఇష్టపడేవారు దాన్ని బుక్ చేయవచ్చు. అయినా ఫ్లయిట్ టిక్కెట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఉన్నాడా.. 

అసలు మీరు ఇదే ప్రశ్న చంద్రబాబును ఎందుకు అడగరు. ఆయన ఢిల్లీ ధర్మపోరాటం పేరుతో ప్రభుత్వంతో జీవో రాయించి దాదాపు 11 కోట్లు ఖర్చు చేయించారు కదా.. ఆయన్ను అడగరా.. అది ప్రజల సొమ్మేగా.. అంటూ కౌంటర్ ఇచ్చారు నాగబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: