కడప జిల్లా.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లా జగన్ వెంటే ఉంటోంది. కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క రాజంపేట మినహా అన్ని స్థానాల్లోనూ గెలిచింది. 


ఆ తర్వాత టీడీపీ  గెలిచిన ఒక్క నియోజకవర్గం  రాజంపేట ఎమ్మెల్యే కూడా వైసీపీలోనే చేరాడు. అయితే గత ఎన్నికల్లో జమ్మలమడుగులో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ టీడీపీలోకి వెళ్లి మంత్రి కూడా అయ్యాడు. అయితే ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. 

అయితే ఒక్క జమ్మల మడుగు సీటు మాత్రం తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందట. జమ్మలమడుగు నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మంత్రి ఆదినారాయణ ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేస్తుంటే.. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు.

వైసీపీ తరపున డాక్టర్ సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలవడం టీడీపీకి  ప్లస్ అయ్యే ఛాన్సుంది. అందువల్ల కడప జిల్లాలో జగన్ ఓడిపోయే సీటు ఇదొక్కటే అవుతుంది. అయితే వివేకా హత్య తర్వాత ఇక్కడ సీన్ కూడా మారుతోందట. ఆ సీటు కూడా గెల్చుకుని కడప జిల్లాను జగన్ స్వీప్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు సర్వే చేసినవారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: