జగన్ మోహన్ రెడ్డి ని ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలని ప్రత్యర్ధులు చేయని ప్రయత్నం అంటూ లేదు. తాడేపల్లిలో వెఎస్ జగన్ ఇటీవల గృహ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ నివాసం ఉండకుండా తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవడంపై పెద్ద చర్చే జరిగింది… ఎన్నికల సమయంలో ఆయన అలా అర్థాంతరంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడిపుడే కారణాలు బయటకు వస్తున్నాయి.. నిర్మాణం పూర్తి అవుతున్నదశలోనే ఇంటి చుట్టూ కిలో మీటర్ పరిధిలో నాలుగు హైపవర్ ఫోన్ ఇంటర్ సెప్టర్లు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇంటర్ సెప్టర్ల ద్వారా పార్టీ ఆఫీసు, ఇంటికి వచ్చే ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అన్నిటిని వినొచ్చు, రికార్డు చేయొచ్చు.


వైఎస్సార్ సిపి అభిమానులైన కొందరు సాంకేతిక నిపుణులు వీటిని గుర్తించిన తర్వాత జగన్ ను అక్కడి నుంచి కార్యకలాపాలు సాగించొద్దని సూచించారట. దానితో తిరిగి హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇంటర్సెప్టర్లను ఎలా గుర్తించొచ్చంటే… ఇయర్ ఫోన్ సాకెట్ నుంచి లౌడ్ స్పీకర్లకు కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరమేదో నియంత్రిస్తున్నట్టు జుయ్ మనే డిస్ట్రబెన్స్ సౌండ్ వినిపిస్తుంది. ఫోన్ వాడకున్నా కూడా దానికదే స్క్రీన్ లైట్ వెలుగుతుంది. బ్యాటరీ తొందరగా డౌన్ అవుతుంది. ఫోన్ వేడెక్కుతుంది. రిసీవింగ్ కాల్స్ స్పష్టంగా వినిపించవు.


ఇవి కాకుండా యాంటీ సర్వైలెన్స్ పరికరాల ద్వారా ఖచ్చితంగా ఇంటర్ సెప్టర్లను గుర్తించ వచ్చు. అవి ఎంత దూరంలో ఉన్నాయి. ఒక దగ్గర స్టాటిక్ గా ఉన్నాయా. వాహనాల్లో ఉంచిన మొబైల్ పరికరాలా అన్నది తెలుసుకోవచ్చు. ఇంటర్ సెప్టర్ ఆపరేషన్లు ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్ ఎటు వెళ్తే అటు అనుసరిస్తాయి. రూట్ మ్యాప్ ముందే తెలుసుకొని 10-20 కి.మీ కొక మొబైల్ ఇంటర్ సెప్టర్ను సిద్ధంగా ఉంచుతారు. జిఎస్ఎం, 3జి,4జి ఫోన్లకు ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి… టెక్నాలజీ ముఖ్యమంత్రిని అని చెప్పునేవాళ్ళ పనితనం చూశారుగా. నీడను కూడా నమ్మని జనాలు ప్రతిపక్ష నాయకుడిపై ఆ స్థాయిలో కుట్రపన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: