ఓ సినిమా బాగున్నా బాగాలేకున్నా.. రివ్యూస్ పాజిటివ్ గా వచ్చినా రాకున్నా.. ప్రేక్షకులకు నచ్చితే అది సూపర్ హిట్ అన్నట్టే. నచ్చిన సినిమాకు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా మౌత్ టాక్ తోనే సినిమాను హిట్ చేస్తారు ప్రేక్షకులు. అలానే ఏపిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఏర్పడే కొత్త ప్రభుత్వం ఏదన్నది ఇట్టే చెప్పేయొచ్చు.   


ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఈసారి రాజన్న పాలన మళ్లీ వస్తుంది.. జగన్ నే సిఎంగా గెలిపించుకుంటాం అంటున్నారు ఆంధ్రా ప్రజలు. ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకుని వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేలా నవరత్నాలంటూ అద్భుతమైన పథకాలను ముందుంచారు.


జగన్ వచ్చేది పక్కా అది జనం అంటున్న మాట. ఇందాకా చెప్పినట్టుగా సినిమా బాగుంది బాగాలేదన్నది మైక్ ముందుకు వచ్చి చెప్పే కోతరాయుళ్ల కన్నా అసలు టాక్ ఏంటన్నది ఆటోమేటిక్ గా తెలుస్తుంది అన్నట్టుగా ఏ సర్వే చూసినా ఏ నోట విన్నా ఆంధ్రాలో వైసిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.


మౌత్ టాక్ తో సినిమా హిట్టు అవుతుంది. మరి ఈ మౌత్ టాక్ తో జగన్ కూడా విజయాన్ని సాధిస్తారో లేదో చూడాలి. అదే జరిగితే జగన్ అనే నేను అంటూ ఆంధ్ర ప్రజల కష్టాలను తన కష్టాలుగా వారి బాధ్యతను తీసుకుని ఓ అద్భుతమైన భవిష్యత్తు ఏర్పాటుచేస్తాడని చెప్పొచ్చు. ఈ విషయం తేలాలంటే మాత్రం మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: