వైసీపీలో రెండవసారి ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఆ పార్టీ పెట్టిన తరువాత వరసగా అనేక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అలాగే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లొ కూడా  వైసీపీ ప్రభంజనం కనిపించింది. దాంతో చంద్రబాబు పని సరి అని అంతా అనుకున్నారు.


ఆ తరువాతే సీన్ మొత్తం మారిపోయింది. సరిగా పోలింగుకు వారం రోజున ముందు వైసీపీ వేవ్ కాస్తా పాలపొంగులా చప్పున చల్లారిపోగా టీడీపీ వీర విజ్రుంభణ చేసింది. దానికి తోడుగా మోడీ, పవన్ గాలి కూడా కలసిరావడంతో అనూహ్యంగా  చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రధాన ప్రతిపక్షంలా జగన్ పార్టీ మిగిలిపోయింది. ఐదేళ్ళ పాటు పార్టీని కాపాడుకున్న జగన్ ఇపుడు మళ్ళీ ఎన్నికలకు సిధ్ధమవుతున్నారు.


ఐతే ఇపుడు కూడా గతంలో లాగానే వైసెపీ వేవ్ స్పష్టంగా ఉంది. అన్ని చోట్ల వైసీపీ గెలుస్తుందని అంచనాలు అందుతున్నాయి. అయితే మళ్ళీ పాత సెంటిమెంట్ వైసీపీని పట్టి పీడిస్తోంది. వారం రోజుల ముందు ఏదైనా మ్యాజిక్ బాబు చేస్తారా అన్న టెన్షన్ వైసీపీ నేతలను పట్టుకుంటోంది. దాంతో ఇప్పటి నుంచి పూటకో యుగంలా వైసీపీ గడుపుతోంది. పోలింగ్ వరకూ ఏమీ జరగకపోతే తమదే విజయం అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: