ఏపీలో ఎన్నికలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన వారే అధికారంలో కొన్నాళ్ళ పాటు శాశ్వతంగా ఉంటారన్న అంచనాలు కూడా ఉండడంతో పాటు ఓడిన పార్టీకి ఇక చివరి ఎన్నికలు అని కూడా ప్రచారంలోకి తెస్తున్నారు. దాంతో ఎక్కడ లేని టెన్షన్ పెరిగిపోతోంది.


ఈసారి జరిగే ఎన్నికలు విషయంలో జోతీష్యం చెప్పే వారు, సంఖ్యా శాస్త్ర నిపుణులు కూడా రంగంలోకి దిగిపోయారు. జగన్ గెలుస్తారని కొందరు అంటే, జగన్ కి రాజ యోగం లేదని మరి కొందరు చెబుతున్నారు. ఆయన జాతకం ప్రకారం మరో మారు బలమైన ప్రతిపక్ష నేతగా వస్తారని కూడా అంటున్నారు. ఇక చంద్రబాబు జాతకం చెబుతున్న వారంతా ఒకే మాట అంటున్నారు. ఆయనకు మహారాజ యోగం ఉందని. దాని వల్లనే ఆయన అనెక సార్లు ముఖ్యమంత్రి కాగలిగారని అంటున్నారు. ఈసారి కూడా ఆయనకు కలసివస్తుందని కూడా చెబుతున్నారు.


ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయనకు కూడా జాతకం ప్రకారం ఈ ఎన్నికలు కలసివస్తాయని అంటున్నారు. ఆయన కింగ్ మేకర్ పాత్రను పోషిస్తారని చెబుతున్నారు. పవన్ బాబుల జాతకాలకు అనుకూలంగా ఉగాది తరువాత గ్రహ స్తితులు మారుతాయని కూడా అంటున్నారు. టీడీపీకి మెజారిటీ రాకపోతే పవన్ ఆయన్ని ఆదుకుంటారని, ఫలితంగా పవన్ కొత్త ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. మరి చూడాలి ఈ జాతకాలు ఏ విధంగా నిజం అవుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: