నలభయ్యేళ్ళ అనుభవం ఆయనది. ఓ విధంగా తెలుగు రాష్ట్రాలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. మిగిలిన వారికి రోల్ మోడల్ గా ఉండాల్సిన చంద్రబాబు ఎన్నికల సభల్లో దారుణంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషణలు వెలువడుతన్నాయి.  చంద్రబాబు సహనానికి మారు పేరు అని చెబుతారు. మరి ఇపుడు జరుగుతున్న ఎన్నికలు బాబుకు అగ్ని పరీక్షగా మారాయి.


ఈ నేపధ్యంలో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా మాటలతో  రెచ్చిపోతున్నారు. కనీస ప్రమాణాలను కూడా పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. జగన్ని పట్టుకుని ఏకి పారేస్తున్నారు. ఎపుడో జగన్ అన్న మాటలను కూడా పట్టుకువచ్చి ఇపుడు చెప్పడం చూస్తూంటే జగన్ మీద ఎంత అక్కసు ఉందో అర్ధమవుతోందంటున్నారు. ప్రతీ మీటింగులో జగన్ని తిట్టడానికే బాబు తన టైం ఎక్కువగా వెచ్చిస్తున్నరన్న మాట కూడా ఉంది.


మోడీని, కేసీయార్ని జగన్ తో కలిపి బాబు ఏపీకి విరోధులుగా చిత్రీకరిస్తున్నారు. జగన్ ఆంధ్ర ద్రోహిని చేస్తున్నారు అసలు ప్రత్యేక హోదాపై నాలుగేళ్ళ పాటు దాగుడుమూతలు ఆడి రాకుండా చేసిందెవరని వైసీపీ  అడుగుతున్న ప్రశ్నలకు బాబు వద్ద సమాధానం  లేదు. ఆరు వందల హామీల గురించి కూడా ఎక్కడా మాట్లాడని చంద్రబాబు జగన్ని ఆడిపోసుకుంటే ఓట్లు పడతాయని భావిస్తున్నారు. మరి ఇది ఆయన బలహీనతను బయటపెడుతోంది. ఎన్నికల ముందు బాబు  ఇలా చిందులు వేస్తే ఓటమిగా జనం అంచనాకు వస్తే టీడీపీకే పెద్ద దెబ్బ పడిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: