జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పార్టీ లక్ష్య స్థాపన మరియు ప్రస్తుతం తన ముందున్న సవాళ్ల గురించి మాట్లాడారు. ముందుగా అతనిని అందరూ పవన్ కళ్యాణ్ తెదేపా తో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు, బాబు రాసిన స్క్రిప్ట్ కు తగ్గట్లు పవన్ వ్యవహరిస్తున్నారు అని చేసే ఆరోపణల పై ప్రశ్నించారు.

అందుకు ఆయన సినిమా పరిభాషలో చెప్పాలంటే తానే స్వయంగా ఒక స్క్రిప్ట్ రైటర్ అని, ఎవరి కథలకు తాను పాత్రలు పోషించను అని అన్నారు. తరువాత ఆయన కేవలం చంద్రబాబు, జగన్ కి మాత్రమే పార్టీలను నడిపే సామర్ధ్యం ఉంది అని అనుకుంటే అది చాలా తప్పని అన్నారు. జనసేన సొంత కాళ్ళపై నిలబడ్డ పార్టీ అని ఆయన అన్నారు.

ఇక పోతే రానున్న ఎలక్షన్లలో తాను కింగ్ అవుతాడా లేక కింగ్ మేకర్ అవుతాడా అని పవన్ ను ప్రశ్నించగా.... అందుకు ఆయన ఇప్పుడు అవేమీ తాను ఆలోచించను అని, సామాజిక మార్పు కోసం రాజకీయాల లోకి వచ్చిన వాడికి ఇవేమీ పెద్దగా పట్టవని అన్నారు. అలాగే రాజకీయాలలో ఉన్న వాడు అవతల వాడు కత్తి పడితే తానూ కత్తి పట్టాలి అని, కాదని దణ్ణం పెడితే చేతులు నరికేస్తారు అని అన్నారు. తమ వైఖరి కూడా అలాగే మాటకి మాట అన్నట్లు ఉంటుందని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: