ఎన్నికల సమయంలో సినీనటుల హడావిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. నటులంతా ఎవరికి నచ్చిన పార్టీవైపు వారు మోహరిస్తుంటారు. కానీ ఈసారి ఎందుకనో సినీరంగం అంతా ఏకపక్షంగా జగన్ వైపే నిలుస్తోంది. ఎవరో ఒకరిద్దరు తప్ప అంతా జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. 


అలీ, పృధ్వీలాంటి వాళ్లు కాస్త ముందుగానే వైసీపీలో చేరారు. ఇక కొందరు నటులు అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా పార్టీలో చేరారు. ఇంకా ఈ చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంతగా నటులు ఎందుకు జగన్ వైపు ఉన్నారు. ఇది దేనికి సంకేతం.

సినీరంగం హైదరాబాద్ లో ఉండటం వల్ల.. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపుల వల్లే సినీనటులంతా వైసీపీలో చేరుతున్నారని.. కేసీఆర్ వారిని బెదిరించి వైసీపీ వైపు పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ వాదనలో ఏమాత్రం నిజం కనిపించడం లేదు.  

అసలు కేసీఆర్ బెదిరిస్తారా..పోనీ బెదిరించినా నటులు బెదురుతారా.. అసలు కేసీఆర్ బెదిరించే టైపు అయితే తెలంగాణ వచ్చాక కూడా సినీరంగం హైదరాబాద్ లోనే కేంద్రీకృతమై ఎందుకు ఉంటుంది. తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ సినీరంగం జోలికి రాలేదు. బెదిరింపులకు పాల్పడలేదు. 
కాబట్టి ఈ వాదన నమ్మశక్యంగా లేదు. ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే సూచను ఏమాత్రం లేకపోవడం వల్లే సినీనటులంతా జగన్ వైపు వచ్చారన్న వాదనలో బలం కనిపిస్తోంది. బహుశా వారు కూడా మార్పుకోరుంటూ ఉండొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: