తాజాగా ప్రముఖ సెపాలజిస్టు డాక్టర్ వేణు గోపాలరావు చేసిన సర్వే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఫిబ్రవరి లోను,అలాగే మార్చి చివరి లోను ఆయన ఆద్వర్యంలో సర్వే జరిగింది. ఒక ఆంగ్ల మీడియాకు ఆయన ఈ అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని ప్రకారం ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో వైసిపి 121 నుంచి 130 శాసన సభ స్థానాలను దక్కించుకోవచ్చు. తెలుగు దేశం పార్టీ 45 నుంచి 54 సీట్లు గెలిచే అవకాశం ఉంది. జనసేనకు ఒకటి,రెండు శాసనస్భ స్థానాల్లో విజయం సాధించవచ్చు. 

psephologist venugopala rao కోసం చిత్ర ఫలితం

ఇక లోక్ సభ ఎన్నికలలు గురించి చెపుతూ వైసిపి 21 ఇరవై ఒకటి, టిడిపి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. గత ఫిబ్రవరి  సర్వే కంటే తాజా సర్వేలో వైసిపీకి ఓట్ల శాతం పెరిగిందని ఆయన చెప్పారు. వైసీపికి 48.10 శాతం ఓట్లు - టిడిపికి 40.10 శాతం ఓట్లు పోలవ్వవచ్చని ఆయన ప్రకటించారు. 

TDP YCP LOgos కోసం చిత్ర ఫలితం

ప్రభుత్వ వ్యతిరేకత బాగుందని, ముఖ్యంగా బిసి లలో చాలా మార్పు ఉందని, జగన్మోహనరెడ్డి పట్ల వారిలో సానుకూలత బాగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.దానికి తోడు చంద్రబాబు ప్రభుత్వంలో కమ్మవారికే ఎక్కువ ప్రయోజనం జరిగిందన్న భావన కూడా బలంగా ఉందని ఆయన వివరించారు. కమ్మేతర కులాలు చంద్ర బాబు నాయకత్వంలో ధారుణ నిర్లక్ష్యానికి గురైన భావన ప్రజాబాహుళ్యంలో కనిపిస్తుందని అన్ని సర్వేలలో ప్రస్పుటమౌతుంది. 

TDP YCP LOgos కోసం చిత్ర ఫలితం


నరేంద్ర మోడీ,కెసిఆర్, వైఎస్ జగన్ లను దూషిస్తూ దుర్భాషలాడుతూ తనను తాను పొగుడుకుంటూ తను చేసిన తప్పులే వేరేవాళ్లు చేస్తే నేరాలుగా ప్రచారం చేస్తూ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించ కుండా ఇతరుల ఆరోపణల పై విపరీత వ్యాఖ్యానాలు చేయటం ప్రజల్లో ఆయనపట్ల వైముఖ్యాన్ని పెంచేశాయి. 



చంద్రబాబు ప్రతిచోటా తనను పొగుడుకుంటూ, పరులను నిందిస్తూ, మాట్లాడటంవల్ల ప్రజలలో ఆయనపట్ల అసలు స్పందనే లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. గతంలో పలు సర్వేలు చేసిన అనుభవం ఉన్న వేణుగోపాలరావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ కు 85 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఈయన సర్వే శాంపుల్ కూడా చాలా పెద్దది,  మూడు లక్షల మందికి చేరువై ఈ లేటెస్ట్ సర్వే చేశానని చెప్పారు.


psephologist venugopala rao కోసం చిత్ర ఫలితం

తెలంగాణ శాసనసభ ఎన్నికల నాటి సెఫాలజిస్ట్ వేణుగొపాల రావు సర్వే

మరింత సమాచారం తెలుసుకోండి: