ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. మంగళవారం ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. రోజంగా  హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోనే గడిపారు. ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అసలే రోజూ ఎడతెగని ప్రసంగాలతో జగన్ హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. 


ఐతే.. ఈ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడంలో పసుపు దళాలు బిజీ అయ్యాయి. నిన్నంతా హైదరాబాద్ లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నాడని గ్రహించండని చంద్రబాబు పార్టీ వర్గాలకు తెలిపారు. దీన్ని కూడా కుట్రగా వర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. 

లబ్ధిదారుల సంక్షేమానికి అడ్డుకునేందుకు ఎంతటి కుట్రలకైనా వైకాపా తెగపడుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉందని అంతా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం కింది స్థాయి నాయకులు జగన్ కుట్ర చేస్తున్నాడని ప్రచారం ప్రారంభించారు.

ఆ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న కుటుంబరావు.. జగన్ లోటస్‌పాండ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి కొత్త వాదన వివరిస్తున్నారు. వారం రోజుల కిందట జగన్ ఇలాగే విశ్రాంతి తీసుకున్నారని.. ఆ మరుసటి రోజే ఏపీ పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారని కొత్త లాజిక్ వినిపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: