కనకమేడల రవీంద్రకుమార్.. తెలుగుదేశం ఎంపీ.. అంతకుముందే ఆయన లాయర్. తెలుగుదేశం లీగల్ సెల్ వ్యవహారాలు ఆయనే చూసేవారు. లాయర్ అంటేనే లాజిక్కులకు మారు పేరు. కానీ ఎంపీ అయిన తర్వాత కనకమేడల లాజిక్కులు మరచిపోయినట్టున్నారు. 


తెలంగాణ ఎన్నికల్లో జరిగిన అవకతవకల తరహాలో ఆంధ్రాలో ప్రయోగించి  దొడ్డిదారిన ఎన్నికల్లో గెలవాలని వైసిపి చూస్తుందని ఆయన తాజాగా ఆరోపించారు. ఆరోపణ చూడటానికి బాగానే ఉన్నా.. లాజిక్ మిస్సయ్యింది. అసలు ఎన్నికల్లో అవకతవకలు సాధ్యమేనా..? 

పోనీ అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అవకతవకలు సాధ్యమే అనుకుందాం కొద్దిసేపు. తెలంగాణ సీఎం కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకునే అధికారంలోకి వచ్చారని అనుకుందాం కనకమేడల చెప్పినట్టుగానే.. మరి ఏపీలో వైసీపీ అవకతవకలు ఎలా పాల్పడగలుగుతుంది.?

ఆంధ్రాలో అధికారంలో ఉన్నది వైసీపీ కాదు కదా.. అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కదా.. అవకతవకలకు ఆస్కారం ఉంటే.. గింటే.. అది టీడీపీకే సాధ్యం కదా.. మరి వైసీపీ ఎలా అవకతవకలు చేస్తుంది.. ఈ చిన్న లాజిక్ అంత పెద్ద లాయరు కనమేడల అనే సీనియర్ లాయర్ ఎలా మిస్సయ్యారంటున్నారు ఆంధ్రప్రజ. 



మరింత సమాచారం తెలుసుకోండి: