లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఏపీలో ఎన్నకల వేడి తారస్థాయికి చేరిన వేళ ఈ సినిమా కలకలం సృష్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకమైన ఘట్టాన్ని రామ్ గోపాల్ వర్మ నెగిటివ్ గా చూపించాడన్న ప్రచారం ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. 


కరడుగట్టిన నందమూరి ఎన్టీఆర్ అభిమానులను మేల్కొలిపేలా.. ప్రజలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను గుర్తు చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని చంద్రబాబు వ్యతిరేకులు ఖుషీగా ఉన్నారు. అంతటి విశేషం ఉన్న ఈ సినిమా మాత్రం ఇంకా ఏపీలో విడుదల కాలేదు. 

ఏపీ తప్ప ప్రపంచమంతా విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. మిగిలిన సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు విలనిజాన్ని మాత్రం కళ్లకు కట్టినట్టు వర్మ చూపించాడన్న టాక్ వచ్చింది. ఈ సినిమా ఏపీలో విడుదలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు.. ఈనెల 3న ము చూశాక ఏ సంగతి చెబుతామన్నారు.

ఏప్రిల్ 3 సాయంత్రం నాలుగున్నరకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. సాధారణంగా భావప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే కోర్టులు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో తొలగిన అడ్డంకులే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: