కర్నూలు జిల్లాలోని తెలుగుదేశంపార్టీలోని  నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో కీలక నేతగా ఉన్న గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేశారు. టిడిపికి రాజీనామా చేయటమే పార్టీకి పెద్ద షాకంటే తన మద్దతుదారులు, కుటుంబసభ్యులతో పాటు వైసిపిలో చేరారు. దాంతో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియకు ఇది ఊహించని షాకనే చెప్పాలి. అసలే మంత్రి గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. దానికితోడు గంగుల తాజా నిర్ణయంతో గెలుపు ఆశలు వదిలేసుకున్నట్లే అనే ప్రచారం జోరందుకుంది.

 

మొదటి నుండి భూమా అఖిలప్రియ వ్యవహారం కాంట్రవర్షియలే. నోటి దురుసు, తలబిరుసుతో సీనియర్ నేతలందరినీ దూరం చేసుకున్నారు. ప్రతీ చిన్న విషయానికీ నేతలతో కీచు లాటలే. పార్టీలో నంద్యాల, ఆళ్ళగడ్డలో తన మాటే చెల్లుబాటవ్వాలన్న పంతంతోనే అందరినీ దూరం చేసుకున్నది మంత్రి. అందుకనే ఓ దశలో భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వటానికి కూడా చంద్రబాబునాయుడు ఇష్టపడలేదు. కానీ చాలామందికి లాగే భూమా అఖిల, భూమా బ్రహ్మానందరెడ్డి టికెట్లు తెచ్చుకున్నారు.

 

టికెట్లయితే తెచ్చుకున్నారు కానీ సీనియర్ నేతలెవరినీ కలుపుకుని పోవటం లేదు. రెండు నియోజకవర్గాల్లో తమ కటుంబానికున్న పట్టుతో పాటు గంగుల ప్రతాపరెడ్డి కుటుబం పట్టుతో ఈజీగానే విజయం సాధిచంవచ్చని భూమా కుటుంబం అనుకున్నారు. అలాంటిది చంద్రబాబు వైఖరి నచ్చలేదని చెప్పి గంగుల ప్రతాపరెడ్డి హఠాత్తుగా టిడిపికి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేయటంతో పాటు వైసిపిలో చేరటంతో మంత్రికి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

 

అసలే ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత. భూమా కుంటుంబానికి దూరమైపోయిన సీనియర్ నేతలు ఏవి సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూఖ్ కుటుంబాలు. టిడిపికి రాజీనామా చేసి జనసేన తరపున పోటీ చేస్తున్న ఎస్పీవైరెడ్డి కుటుంబం రూపంలో మంత్రికి కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఈ దశలో మంత్రి గెలుపును అనుమానంగా మార్చాయి. తాజాగా మంత్రి ఎంతో నమ్మకం పెట్టుకున్న గంగుల కుటుంబం కూడా వైసిపిలో చేరిపోవటంతో మంత్రి గెలుపు కష్టమే అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.

 

తన మద్దతుదారులు, కుటుంబ సభ్యులతో సమావేశమైన గంగుల ప్రతాపరెడ్డి వైసిపి అభ్యర్ధి గంగుల బిజేంద్రరెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపిచ్చారు. బిజేంద్రరెడ్డి అంటే ఎవరో కాదులేండి. ప్రతాపరెడ్డి సోదరుడు గంగుల  ప్రభాకర రెడ్డి కొడుకే. అంటే గంగుల కుటుంబం యావత్తు ఇపుడు వైసిపిలో చేరిపోయింది. దాంతో నంద్యాల ఎంపి సీటుతో పాటు నంద్యాల, ఆళ్ళగడ్డలో వైసిపి గెలుపు అవకాశాలు బాగా మెరుగయ్యాయనే చెప్పాలి. మొత్తం మీద పోలింగ్ వారం రోజులుందనగా మంత్రికి ఊహించని షాక్ తగిలిందనే  చెప్పాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: