జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇటీవల ఓఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా మొనగాళ్లు వారిద్దరే అనుకోవడం కరెక్టు కాదన్నారు. వాస్తవంగా మాట్లాడితే ఓ వ్యక్తిగా స్థాపించి నిలబడిన పార్టీ జనసేన మాత్రమే అన్నారు. 


ఇందుకు ఆయన వాదన ఇలా ఉంది. చంద్రబాబు టీడీపీని ఆయన మామ నుంచి తీసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి.. తన తండ్రి వారసత్వంగా ఆయన పేరుతో పార్టీ పెట్టారు. ఒక్క జనసేన మాత్రమే ఓ వ్యక్తిగా పార్టీ స్థాపించి ఈ స్థాయిలో నిలబడింది అన్నారు పవన్. 

వేరొకరి స్క్రిప్టును తాను చదువుతున్నానన్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను నటుడినే కాదు స్క్రిప్టు రైటర్ ను, డైరెక్టర్ ను కూడా అని గుర్తు చేశారు. నా స్క్రిప్టు నేను రాసుకోగలను. నా సినిమా నేను తీసుకోగలను.. అన్నారు.

మరి.. ఈ ఎన్నికల్లో మీరు కింగ్ అవుతారా.. కింగ్ మేకర్ అవుతారా అంటే.. ఈ రాజకీయ పరిభాష తనకు నచ్చదని.. తాను సమాజంలో ఎంత మార్పు తీసుకొస్తానన్నదే తనకు ప్రధానమని అన్నారు. ఎప్పుడో ఏదో ఒక పార్టీ అలా అయ్యింది కాబట్టి అన్నీ అలా అవుతాయని చెప్పకూడదన్నారు.

ప్రస్తుతం పార్టీ నడపాలంటే ఐడియాలజీ ఒక్కటే ఉంటే సరిపోదని.. కండబలం కూడా ఉండాలన్నారు. ప్రత్యర్థి కత్తి పట్టుకున్నప్పుడు మనమూ కత్తిపట్టకపోతే చేతులు నరికేస్తారని ఉదాహరణగా చెప్పారు పవన్ కల్యాణ్. 



మరింత సమాచారం తెలుసుకోండి: