గూగుల్ ట్రెండ్స్ లో చంద్రబాబునాయుడుకన్నా జగన్మోహన్ రెడ్డే టాప్ గా నిలిచారు. మార్చి 2వ తేదీ నుండి 22వ తేదీ వరకూ గూగుల్ ఎనలటిక్స్ లో ఆ విషయం స్పష్టమైనట్లు గుగుల్ సంస్ధే ప్రకటించింది. పోయిన నెలలో గుగుల్లో ఎక్కువగా వెతికింది జగన్ గురించే అంటూ తాజా స్టాటిస్టిక్స్ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

 

చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయస్సు వాళ్ళ వరకూ చాలా విషయాల్లో గుగుల్ నే సెర్చ్ చేస్తున్నారు. అందులో కూడా ప్రస్తుతం జరగబోయే ఎన్నికల విషయంలోనే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అందుకనే జాతీయ పార్టీలతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణానే కాకుండా ఏపి గురించి కూడా అవసరమైన వివరాల కోసం గుగుల్ సెర్చ్ నే ఎంచుకుంటున్నారు.

 

అందులో భాగంగానే మార్చి నెల 2వ తేదీ నుండి 22వ తేదీ వరకూ ఏపిలోని జగన్ , చంద్రబాబుకు సంబంధించిన వివరాల కోసం నెటిజన్లు తెగ వెతికారట. ఆ వెతకటంలో  ఎక్కువమంది చంద్రబాబుకన్నా జగన్ కోసమే వెతికినట్లు సమాచారం. ఎక్కువమంది చంద్రబాబు, జగన్ అనే పేర్లనే ఎక్కువగా వెతికినట్లు వివరాలు చెబుతోంది.

 

ట్రెండ్స్ లో జగన్ పేరు మార్చి 2వ తేదీ నుండి అలా అలా పైపైకి వెళ్ళిపోతుంటే చంద్రబాబు పేరు మాత్రం క్రిందకే ఉంది. ఎనలటిక్స్ లో చంద్రబాబు ఏరోజూ జగన్ దరిదాపులకు కూడా రాలేకపోయిన విషయం గుగుల్ ట్రెండ్స్ మ్యాప్ లో స్పష్టంగా తెలిసిపోతోంది.  తాజాగా గుగుల్ రిలీజ్ చేసిన ట్రెండ్స్ ఎనలిటిక్స్ విడుదల చేయటం దేనికి సంకేతాలో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: